త్వరలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నాను అని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే గౌరవం ఉంది.. నా భావ జాలానికి టీడీపీతో కలిసి ప్రయాణించలేకపోయాను అని పేర్కొన్నారు. 2019 ఎన్నికల ముందు టీడీపీ నుంచి బయటికి వచ్చాను.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కావటంతో నా భావజాలానికి సరిపోతుందని వైసీపీలోకి వెళ్ళా.. నాకు సీఎం జగన్ కి ఎటువంటి గ్యాప్ లేదు.. వైసీపీలో నాకు సముచిత స్థానం కల్పించారు అని ఆయన ప్రకటించారు. అయితే, వైసీపీ అధిష్టానం నన్ను పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నారని ఆమంచి కృష్ణమోహన్ చెప్పారు.
Read Also: Sree Vishnu New Movie: పండగ వేళ శ్రీవిష్ణు కొత్త సినిమా ఆరంభం!
కానీ, నాకు చీరాల అయితేనే కరెక్ట్ అనుకుని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాను అని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు. కొద్ది రోజులుగా చీరాల ప్రజలతో మమేకమైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళమని సూచించారు.. క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాను.. ఆటో గుర్తుతో మరో సారి పోటీ చేయాలనుకున్నా.. కానీ, కేంద్ర ఎన్నికల సంఘం ఆటో గుర్తును రద్దు చేసింది.. అందు వల్ల చీరాల ప్రజల మద్దతుతో భారీ మెజారిటీతో ఘన విజయం సాదిస్తాను అని ఆమంచి కృష్ణమోహన్ వెల్లడించారు.