నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోనే జలదంకి మండలం బ్రాహ్మణ కాక గ్రామ ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు నాయకులు పోటెత్తారు. తొమ్మిదవ మైల నుంచి రైతన్నలు సుమారు 200 ట్రాక్టర్ల ర్యాలీతో మద్దతు పలికారు. తెలుగుదేశం- జనసేన- బీజేపీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ ద్వారా సంఘీభావం తెలిపారు. గజమాలతో ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, వంటేరు వేణుగోపాల్ రెడ్డిలను సన్మానించారు. మండలంలోని నలుదిక్కుల నుంచి పెద్ద ఎత్తున ప్రజా ఆశీర్వాద సభకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి నాయకత్వంలో జలదంకి మండలం నాయకుల ఆధ్వర్యంలో బ్రాహ్మణ కాకకు చెందిన సుమారు 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Read Also: Memantha Siddham Bus Yatra: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ ముఖ్యనేత!
టీడీపీలోకి జాయిన్ అయిన వారందరికీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వంటేరు వేమిరెడ్డి, కాకర్ల కావ్య నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం జిందాబాద్ నారా చంద్రబాబునాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అని స్లోగన్స్ ఇచ్చారు. గత నెల 30వ తేదీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జలదంకి మండలానికి చెందిన ఎంపీపీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు సర్పంచులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం నాడు జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో బ్రాహ్మణ కాక ఖాళీ అయింది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తేనే మన నియోజకవర్గం బాగుపడుతుంది అని వంటేరు వేణుగోపాల్ రెడ్డి అన్నారు.
Read Also: Production No2: హీరోయిన్ గా దృశ్యం పాప రెండో సినిమా.. ఏకంగా ప్రొడ్యూసర్ కొడుకుతో..!
ఈ కార్యక్రమంలో కావలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బాబు యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు భరత్ కుమార్, సురేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి రంగారావు, జనసేన ఇన్చార్జ్ పొట్టే వెంకటేశ్వర్లు, మాజీ ఎంసీ చైర్మన్ మన్నటి వెంకటరెడ్డి, జలదంకి మండల నాయకులు జయచంద్ర రెడ్డి, జనార్దన్ రెడ్డి, మధు మోహన్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసైనికులు, బీజేపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.