చంద్రబాబు నాయకత్వంలో మహానాడు పేరుతో దగానాడు జరగబోతోందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. కేవలం ఏపీలోని ప్రజలకే కాదు.. జెండా మోసిన కార్యకర్తలకు కూడా దగానాడే అని విమర్శించారు.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. మహానాడుపై విమర్శలు గుప్పించారు.
అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నామంటే ఈరోజు కంటే ప్రత్యేకమైన రోజు మరి ఏది ఉండదలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో మోడీని ఎప్పుడు కలిసిన చాలా ఆహ్లాదకరంగా ఉండేవారని.. కానీ మొన్నటి సమావేశంలో అమరావతికి రమ్మని పిలవడానికి వెళ్తే.. తమ భేటీ చాలా గంభీరంగా సాగిందని గుర్తు చేశారు.
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం. పల్లె నుంచి పట్నం వరకు, దేశధినేతల నుంచి విదేశీయుల వరకు అందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బర్త్‌డే బర్త్ డే విషెస్‌పై సీఎం స్పందించారు. "నా పుట్టినరోజున మీరు అందించిన శుభాకాంక్షలు, మీరు చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. ఇప్పటివరకు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు." అని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో రాసుకొచ్చారు. చాలా విషయాలను…
అమరావతిలో చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలు పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాల్‌లో రెండు పుస్తకాలను రఘురామకృష్ణరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసిన ప్రసంగాలకు సంబంధించి, రెండు పుస్తకాలను జయప్రద ఫౌండేషన్ ప్రచురించింది. ఈ కార్యక్రమంలో పుస్తక రూపకర్త టీడీ జనార్ధన్ మాట్లాడారు.
తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని, రాబోయే 22 ఏళ్లలో ఏపీని దేశంలో నెంబర్ వన్‌గా చేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ముందుగా ఆయన పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిగా మాట్లాడారు.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. "ప్రజల ఆశీస్సులతో 47 ఏళ్ళ క్రితం ఇదే రోజు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాను. 41 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను. 9 ఏళ్ళు సమైక్యాంధ్ర సీయంగా,…
Lokesh : మంత్రి నారా లోకేష్ మంగళగిరి అభివృద్ధి పనులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న వంద రోజుల్లో మంగళగిరి ప్రజలు ఊహించని రేంజ్ లో అభివృద్ధి పనులు స్టార్ట్ చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నడుమూరు ఫ్లై ఓవర్లు, రహదారులు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటానని.. రాబోయే ఐదేళ్లలో మంగళగిరి రూపు రేఖలు మారుస్తానని తెలిపారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన గోశాలను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్…
ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.. వారి ఆధ్వర్యంలో అభివృద్ధికి అవకాశం ఉందన్నారు టీజీ వెంకటేష్..
మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించనున్నారు. జనవరి 8న ప్రధాని మోడీ ఏపీ పర్యటనకు రానున్నారు. రూ. 85 వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు సోము వీర్రాజు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం లో ప్రజా పాలన సాగుతుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచి అమలు చేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.