చంద్రబాబు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని, పిల్లలకు ఇంగ్లీషు మీడియం ఇవ్వొద్దని కోర్టుకు వెళ్లారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లివూరులో గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు.
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో విశాఖ అభివృద్ధికి నెమ్మదిగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు కేంద్రం కూడా విశాఖలో పలు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు విశాఖలో బయోటెక్నాలజీ పార్కు ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు వచ్చ