పశ్చిమబెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయిగురి ప్రాంతంలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసిందన్నారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 19వ తేదీ బుధవారం రోజు బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే పొలిటికల్ గా అంతకంతకూ బిజీ అవుతున్న పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. పవన్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే పవన్ సినిమాలకు గుడ్ బై చెబుతారని కొన్ని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ వార్తల గురించి మెగా ఫ్యామిలీ నుంచి…
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. పవన్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే.
జగన్ ని దింపాలని అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నాయన్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు ఎమి చేస్తామో అన్నది మాత్రం చెప్పడం లేదు.. పవన్ కళ్యాణ్ కుల మతాలను రెచ్చకొడుతున్నాడు.. చంద్రబాబుని తిట్టిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్నాడు అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని వీడుతున్న వారందరూ చంద్రబాబు కోవర్టులే.. ముందు నుంచి చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారని ఆయన ఆరోపించారు. వైసీపీలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం పెద్ద దళితవాడ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్రా, ఒడిశా వివాదాస్పద గ్రామాల్లో పర్యటిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొట్టు సత్యనారాయణ. ఏపీ డిప్యూటీ సీఎం. దేవాదాయశాఖ మంత్రి. గత మూడేళ్ల కాలంలో ఎక్కువగా చర్చల్లో నలిగింది ఈ శాఖే. కొట్టుకు ఆ విషయం తెలియంది కాదు. కానీ.. మంత్రిగారు ఎటుపడితే అటు నాలిక మడత పెట్టేస్తున్నారని సొంత శాఖలోనే సణుగుడు ఎక్కువైంది. దీంతో దేవాదాయశాఖ వర్గాలు.. ప్రభుత్వ పెద్దల్లో చర్చగా మారిపోయారట కొట్టు సత్యనారాయణ. ఇటీవల మంత్రి కొట్టు సత్యనారాయణ కొన్ని కామెంట్స్ చేశారు. ఐదు లక్షల్లోపు ఆదాయం ఉన్న ఆలయాలను అర్చకులకు అప్పజెప్పాలని కోర్టు…
ఆ డిప్యూటీ సీఎంను రెండు నీటి ప్రాజెక్టులు తెగ ఇబ్బంది పెడుతున్నాయట. మంత్రి పదవి చేపట్టగానే వెంటనే పూర్తి చేస్తామని చిటికెలు కూడా వేశారట. చూస్తుండానే రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఎక్కడి గొంగళి అక్కడే. అమాత్యుల వారికి కూడా చికాకు మొదలైందట. ఇంతకీ ఎవరా మంత్రి? అధికారంలో ఉండి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? కృష్ణాపురం, ఎన్టీఆర్ జలాశయాలను అభివృద్ధి చేస్తానని హామీ..! ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే. ఇక్కడ వరసగా…
అయ్యన్న పాత్రుడుది టెర్రరిస్ట్ మనస్తత్వం అని ఏపీ డెప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. జగన్ వైఎస్ కుమారుడే కానీ వారసుడు కాదు.పేదల హృదయాలను గెలుచుకున్న వాడు సీఎం జగన్ అని చెప్పారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారు. అయ్యన్న మాటలతో సమాజమే సిగ్గుతో తలదించుకుంది. బీసీ నాయకుడైన అయ్యన్న ఎస్సీ మహిళైన హోం మంత్రిని కించ పరిచారు. అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసు నమోదు చేయాలి అన్న ఆయన…