Deputy CM Rajanna Dora: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్రా, ఒడిశా వివాదాస్పద గ్రామాల్లో పర్యటిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా, ఒడిశా వివాస్పద గ్రామాలపై సుప్రీంకోర్టులో స్టే ఉండగా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. బాగా చదువుకున్న విద్యాశాఖ మంత్రి కనీసం ఇంగితం లేకున్నా మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఆంధ్రా గో బ్యాక్ నినాదాలు చేసిన ధర్మంద్ర ప్రధాన్ ఆ మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు.
Read Also: Balineni Srinivas Reddy: మంత్రివర్గ విస్తరణ, ముందస్తు ఎన్నికలపై బాలినేని క్లారిటీ!
ఇదే కేంద్ర మంత్రి ఆరునెలల క్రితం శాసనసభలో తీర్మానం చేయండి అని నవీన్ పట్నాయక్‌ను కోరడం జరిగిందన్నారు. ఈ విషయం అన్ని వార్త పత్రికల్లో కూడా వచ్చిందని మంత్రి వెల్లడించారు. కొంచెం విజ్ఞతతో, వివేకంతో మాట్లాడితే బాగుండేదన్నారు. దేశానికి మంత్రి అయినప్పుడు ఒడిశాపై ప్రేమ చూపించి ఆంధ్రాపై వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తండ్రీకొడుకుల్లా మాట్లాడుకుంటున్నారని మంత్రి వెల్లడించారు. అలాంటిది కేంద్ర మంత్రి అలా మాట్లాడడం సరికాదన్నారు.