నాయకులు ఎవరైనా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తారు… కానీ చంద్రబాబు, టీడీపీ మద్యపాన ఉద్యమం చేస్తాం అంటున్నారు అని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. చంద్రబాబుకు మద్యపాన నియంత్రణ ఇష్టం లేనట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు. మేము మద్యం షాపుల సంఖ్యను సగానికి తగ్గించాం. ఈర్ష్య, ద్వేషం, పగ…ఈ మూడు చంద్రబాబు లక్షణాలు. కాబట్టి ప్రజా కోర్టులో చంద్రబాబుకు ఉరిశిక్ష వేశారు అని పేర్కొన్నారు. తాగుబోతులు, మద్య…
వైసీపీలో ఆయనో కీలకనేత. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారపక్షంలో ఉన్నా తాను చెప్పాల్సింది కుండబద్ధలుకొట్టి మరీ చెప్పేస్తారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన చేసిన కామెంట్స్ ఆ కోవలోకే చేరాయి. మంత్రి పదవి రాలేదని అక్కసా? లేక తప్పొప్పులు చెప్పకొంటే తనకూ మిగిలినవాళ్లకూ తేడా ఏంటని అనుకుంటున్నారో.. మాటలతోనే మంటెక్కిస్తున్నారు. దీంతో అదేంటి అన్నాయ్.. ఆయన అలా అనేశారేంటి అని అంతా చర్చించుకుంటున్నారట. స్వపక్షంలో విపక్షంగా మారిన తీరుపై చర్చ! ధర్మాన ప్రసాదరావు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన…
ఇప్పుడా జిల్లాలో మంత్రిగారు పెట్టుకున్న ఉంగరం హాట్ టాపిక్. ఆయనకు కరోనా వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా.. పార్టీలో, కేడర్‌లో ఆ ఉంగరం చుట్టూనే చర్చ జరుగుతోంది. అసలే మంత్రివర్గ ప్రక్షాళనపై ఊహాగానాలు వస్తున్న వేళ.. అమాత్యులవారి చేతికి ఆ రింగ్ ఎందుకు వచ్చిందన్న ప్రశ్న ఆసక్తిగా మారింది. ఆయనెవరో.. ఆ ఉంగరమేంటో.. ఈ స్టోరీలో చూద్దాం నారాయణస్వామి ఉంగరంపై చర్చ! నారాయణ స్వామి. ఏపీ డిప్యూటీ సీఎం. చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరు నుంచి వరసగా…
రైతు దినోత్సవాన్ని రైతు దగా దినోత్సవంగా అభివర్ణించడం బాధాకరం అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జగన్ ప్రభుత్వం పారదర్శకంగా పాలన చేస్తుంటే… టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ప్రభుత్వం ఏ పనిచేస్తున్నా టీడీపీ నాయకులు వక్రీకరిస్తున్నారు. రైతులను టీడీపీ నాయకులు మభ్యపెడుతున్నారు. గతంలోనూ నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులది వక్రబుద్ధి అని తెలిపారు ఆయన. స్థానిక ఎన్నికల ఫలితాలు వస్తే..ప్రజలు వారికి ఎన్ని స్థానాలు ఇచ్చారో తేలిపోతుంది. చంద్రబాబుతో…
రెండున్నరేళ్ల డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఎంత లేదన్నా పవర్ పవరే కదా? దాన్ని కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరం లేకుండా తాను సశ్చీలుడునని చెప్పుకొంటున్నారు ఓ డిప్యూటీ సీఎం. అంతేకాదు చివరకు తనకంటే వయసులో చాలా చాలా చిన్నవాడైన సీఎం జగన్ కాళ్లమీద పడ్డారు. ఇవన్నీ ఆయన పవర్ని కాపాడతాయా? నిజాయితీగా పేదవారి కోసం పనిచేశానని చెబుతున్నారుఎవరు కనిపించినా ఒకటే పాట పాడుతున్న డిప్యూటీ సీఎం! మంత్రి పదవి రాగానే ఏసీ…
మతసమరస్యానికి మన రాష్ట్రం ప్రతీక. అర్చకులు, పాస్టర్లు, ఇమామ్, మౌజన్ ల వేతనాలు పెంచడంపై డిప్యూటీ సీఎం అంజాద్ బాష హర్షం వ్యక్తం చేసారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. సమాజంలో అర్చకులు,పాస్టర్లు, మౌజన్లు,ఇమామ్ లకు గౌరవ స్థానం ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం. గతంలో వీరికి ఇచ్చే గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెంచి వారి ముఖాల్లో ఆనందం చూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పాస్టర్లకు…