తిరుమలలో మీడియాపై దాడి తప్పా.. ఒప్పా అనే అంశంపై నేను స్పందించను అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. జర్నలిస్ట్ పై దాడిని నేను సమర్దించను అన్నారు. కాంగ్రెస్ ని తిట్టిని వైఎస్ షర్మిలా ఇప్పుడు పదవి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారు అని పేర్కొన్నారు. జగనన్న బాణమన్నా షర్మిలా.. ఇప్పుడు ఎవరి బాణమో ఆమె చెప్పాలి అని డిమాండ్ చేశారు. జగన్ ని దింపాలని అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నాయన్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు ఎమి చేస్తామో అన్నది మాత్రం చెప్పడం లేదు.. పవన్ కళ్యాణ్ కుల మతాలను రెచ్చకొడుతున్నాడు.. చంద్రబాబుని తిట్టిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్నాడు అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు.
Read Also: Medaram Jathara: మేడారంలో జనసంద్రం.. పిల్లాజెల్లా జలకాలాట..
ఇక, 30 ఏళ్లుగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడింది అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టిందన్నారు. జగనన్న కాలనీ ద్వారా అర్హులందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేయించామని చెప్పారు. తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే గంగాధర నెల్లూరు నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని ఆయన వెల్లడించారు.