తనకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అటువంటి తనకు పిఠాపురం ప్రజలు ఘన విజయం ఇచ్చారని.. తన గాయాలకి పిఠాపురం ప్రజలు మందు వేశారని కొనియాడారు. జన్మంతా పిఠాపురం ప్రజలకి రుణపడి ఉంటానని తెలిపారు. నేడు పిఠాపురం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే.
డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఆధిపత్యం అహంకారంతో అధికారులపై దాడులు చేస్తున్నారు.. ఇష్టారీతిన చేస్తామంటే చూస్తూ ఊరుకోం.. తాట తీస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదు.. ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారు.. ఎంపీడీవో జవహర్ బాబును అమానుషంగా కొట్టారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Fake IPS Officer: పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం కనిపించింది. దీంతో ఐపీఎస్ యూనిఫారంతో వచ్చిన సూర్య ప్రకాష్ అనే వ్యక్తిని విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అనుసరిస్తున్న విధానం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలోని నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అత్యుత్తమ పనితీరును కనబరిచిన పంచాయతీలకు కేంద్ర సర్కారు ఇచ్చే జాతీయ స్థాయి పురస్కారాలుకు నాలుగు గ్రామాలు ఎంపిక కావడం విశేషం.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పవన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంపై ప్రధానితో ఆయన చర్చించనున్నారు.
మానవ జాతి మనుగడకు అటవీ సంరక్షణ అవసరం అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అటవీశాఖలో ఎలాంటి సంస్కరణలకైనా తాను సహకరిస్తానని.. అదనపు నిధులు కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తీసుకువస్తానన్నారు. తనకు చిన్నప్పటి నుంచి అటవీశాఖ అంటే ఎంతో గౌరవం అని, అటవీశాఖలో అమరులైన 23 మందిని చరిత్ర తలుచుకునే లాగా ఏర్పాటు చేస్తామని పవన్ చెప్పారు. నేడు గుంటూరులో జరిగిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నారు. తొలిసారి ఏపీ ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి అమిత్ షాతో సమావేశమయ్యారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నారు. తొలిసారి ఏపీ ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఏపీలో పరిస్థితులు, రాజకీయ అంశాలపై అమిత్ షాతో పవన్ కల్యాణ్ చర్చించే అవకాశం ఉంది.
AP Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పుకొచ్చారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా నేను బాద్యతలు తీసుకుంటాను అని తేల్చి చెప్పారు.