Pawan Kalyan: మానవ జాతి మనుగడకు అటవీ సంరక్షణ అవసరం: డిప్యూటీ సీఎం పవన్
- అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్
- మానవ జాతి మనుగడకు అటవీ సంరక్షణ అవసరం
- చరిత్ర తలుచుకునే లాగా ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవ జాతి మనుగడకు అటవీ సంరక్షణ అవసరం అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అటవీశాఖలో ఎలాంటి సంస్కరణలకైనా తాను సహకరిస్తానని.. అదనపు నిధులు కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తీసుకువస్తానన్నారు. తనకు చిన్నప్పటి నుంచి అటవీశాఖ అంటే ఎంతో గౌరవం అని, అటవీశాఖలో అమరులైన 23 మందిని చరిత్ర తలుచుకునే లాగా ఏర్పాటు చేస్తామని పవన్ చెప్పారు. నేడు గుంటూరులో జరిగిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ, పోలీస్ శాఖలు.. డిప్యూటీ సీఎంకు గౌరవ వందనం సమర్పించాయి.
ఉద్యోగ బాధ్యతల్లో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమర వీరులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులను పేరుపేరునా పలకరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ‘మానవ జాతి మనుగడకు అటవీ సంరక్షణ అవసరం. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో అనేక మంది అసువులు బాసారు. అటవీశాఖ అధికారులు ఎందరో స్మగ్లర్‌ల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రమైన దెబ్బలు తిన్నారు. స్మగ్లర్‌ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 23 మంది కుటుంబ సభ్యులకు సాయం అందించాం. అందులో అన్ని కేటగిరీల సిబ్బంది, అధికారులు ఉన్నారు. అడవులను సంరక్షణ చేయడంలో వారి పాత్ర కీలకం. అలాంటి వారు త్యాగాలు మర్చిపోకూడదు. అటవీశాఖలో యోధుల త్యాగాలను చిరస్థాయిగా నిలిచిపోయే లాగా ఏర్పాటు చేస్తాం. సంస్మరణ దినోత్సవాల వల్ల భవిష్యత్ తరాల వారికి త్యాగాల చరిత్ర తెలుస్తుంది’ అని అన్నారు.
Also Read
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
‘నాకు చిన్నప్పటి నుంచి అటవీశాఖ అంటే గౌరవం. అటవీశాఖలో అమరులైన 23 మందిని చరిత్ర తలుచుకునే లాగా ఏర్పాటు చేస్తాం. నా చేతిలో అటవీశాఖ ఉన్నంతవరకు అటవీశాఖ అధికారులు స్వేచ్ఛగా పనిచేయవచ్చు. అటవీశాఖ కోసం, పారిశ్రామికవేత్తల నుండి విరాళాలు సేకరిస్తాం. అమరవీరుల స్థూపాలు నిర్మిస్తాం. దండి సత్యాగ్రహం విగ్రహాల స్ఫూర్తితో, అటవీశాఖ అమరవీరుల స్థూపాలు నిర్మిస్తాం. అమరవీరుడు ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. అటవీశాఖలో ఎలాంటి సంస్కరణలైనా చేయండి, నేను సహకరిస్తా. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి అదనపు నిధులు కావాలంటే నేను తీసుకువస్తా’ అని డిప్యూటీ సీఎం పవన్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!