ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్. ఈ సందర్భంగా కొత్త సీఎస్‌ను ఆశీర్వదించారు టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వేద పండితులు. ఇక, కొత్త సీఎస్ కు శుభాకాంక్షలు తెలిపారు వివిధ శాఖల అధికారులు..
ఉన్నట్టుండి మళ్లీ తన సెలవులను రద్దు చేసుకున్నారు సీఐడీ చీఫ్ సంజయ్. సెలవులపై విదేశాలకు వెళ్లాలనుకున్న తన నిర్ణయాన్ని మార్చుకున్నారట.. సీఐడీ చీఫ్ సంజయ్ విదేశాలకు వెళ్లేందుకు సీఎస్ అనుమతివ్వడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో డీబీటీ పథకాల అమలుపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఈసీ లేఖ రాసింది.. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే బటన్ నొక్కి వివిధ పథకాలకు నిధులు విడుదల చేశారన్న ఎన్నికల కమిషన్.. రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లాల్సిన నిధులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చేరలేదని పేర్కొంది.. లబ్ధిదారుల ఖాతాలకు నిధుల జమలో జరిగిన జాప్యంపై వివరణతో…
ఏపీలో పోలింగ్ సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది వరకే పలువురు ఉన్నతాధికారులు ఈసీ బదిలీ చేసింది. తాజాగా ఏపీ డీజీపీ కే. రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి రిలీవ్ అవ్వాలని రాజేంద్రనాథ్ రెడ్డికి తెలిపింది.