CID Chief Sanjay: ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సంజయ్ విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.. ఇక, ఆయన విదేశాలకు వెళ్లేందుకు సీఎస్ జవహర్‌రెడ్డి అనుమతులు కూడా మంజూరు చేశారు.. కానీ, ఉన్నట్టుండి మళ్లీ తన సెలవులను రద్దు చేసుకున్నారు సీఐడీ చీఫ్ సంజయ్. సెలవులపై విదేశాలకు వెళ్లాలనుకున్న తన నిర్ణయాన్ని మార్చుకున్నారట.. సీఐడీ చీఫ్ సంజయ్ విదేశాలకు వెళ్లేందుకు సీఎస్ అనుమతివ్వడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది.. ఇప్పుడు సంజయ్ సెలవుపై విదేశాలకు వెళ్లాలనుకున్న ప్రతిపాదనను వెనక్కు తీసుకోవడంపై ఆసక్తికర చర్చ మొదలైంది.
Read Also: CM Revanth: బీజేపీ గెలిచిన 8 చోట్ల బీఆర్ఎస్ 7 చోట్ల డిపాజిట్ కోల్పోయింది..
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు విడుదలైన తర్వాత రోజే.. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఏపీ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ సెలవులపై విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం చర్చకు దారితీసింది.. ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన సంజయ్ కు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. అయితే, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రతిపక్షాలను టార్గెట్ చేశారనే విమర్శలను ఎదుర్కొన్నారు సీఐడీ చీఫ్ సంజయ్. మరోవైపు.. సంజయ్ విదేశాల నుంచి తిరిగి వచ్చేంత వరకు వేరే అధికారులకు సీఐడీ బాధ్యతలు అప్పగించాలని డీజీపీకి సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి సంజయ్ తిరిగొచ్చాక సీఐడీ చీఫ్ గా రీ-పోస్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.. కానీ, ఇప్పుడు తన సెలవునే రద్దు చేసుకున్నారు సీఐడీ చీఫ్ సంజయ్.