CM Chandrababu: బదిలీలపై సీఎం కసరత్తు.. సీఎంవో, సీఎస్, డీజీపీతో భేటీ
- పరిపాలనలో ప్రక్షాళన ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
- సచివాలయంలో సీఎంవో.. సీఎస్.. డీజీపీలతో సమావేశం
- ఐఏఎస్.. ఐపీఎస్ వంటి అధికారుల బదిలీలపై కసరత్తు
- గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారుల జాబితా ఇప్పటికే సిద్ధం
- సమర్థులైన అధికారులు.. నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగులు ఇవ్వడంపై ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పరిపాలనలో ప్రక్షాళన ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. అందులో భాగంగా సచివాలయంలో సీఎంవో, సీఎస్, డీజీపీలతో సమావేశం అయ్యారు.. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారుల బదిలీలపై కసరత్తు ప్రారంభించారు.. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసింది ఏపీ సీఎంవో.. అయితే, సమర్థులైన అధికారులకు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగులు ఇవ్వడంపై ఫోకస్ పెట్టారు.. ఇదే సమయంలో.. గత ప్రభుత్వంలో వైసీపీతో అంటకాగిన వారిని దూరంగా పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు ప్రభుత్వ పెద్దలు. ఈ నేపథ్యంలో.. ప్రవీణ్ ప్రకాష్, శశి భూషణ్, అజేయ్ జైన్, శ్రీలక్ష్మీ, గోపాల కృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీకి రిపోర్ట్ చేయమంటారని చర్చ సాగుతోంది..
Read Also: Mr Bachchan : రవితేజ ‘మిస్టర్ బచ్చన్ ‘ మూవీ స్పెషల్ అప్డేట్ వైరల్..
Also Read
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ఇక, సీనియర్ ఐపీఎస్‌లు రాజేంద్రనాధ్ రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, ఎన్. సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది.. మరోవైపు.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై కేసులు కూడా నమోదు చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందనే ప్రచారం సాగుతోంది.. 5 హామీలపై అమలుపై ప్రణాళికతో, వేగంగా పని చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. నిర్ణయం వెలువడిన తరువాత జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.. టీటీడీ ప్రక్షాళనతో పని మొదలు పెట్టిన చంద్రబాబు. టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని తప్పించి.. ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చిన విషయం విదితమే కాగా.. అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. దీంతో.. అధికారుల్లో గుబులు పుట్టుకుంది.. తామకు ఏ శాఖ వస్తుంది.. తమకు ఎక్కడికి పంపుతారనే టెన్షన్‌లో అధికారులు ఉన్నారు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?