రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సామర్లకోట పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ వద్ద వివిధ వైద్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సహాయం కోరుతూ ముఖ్యమంత్రికి వినతులు అందించగా.. తప్పకుండా ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైయస్ జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్షపై అధికారులు సీఎంకు వివరాలందించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 1,22,69,512 కుటుంబాలను ఆరోగ్య సిబ్బంది సర్వే చేశారు. ఇప్పటి వరకూ మొత్తంగా 3,17,65,600 మందిని ఆరోగ్య సిబ్బంది కవర్ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వీఆర్‌ఏ సంఘం నాయకులు కలిసి కృతజ్ఙతలు తెలిపారు. రద్దు అయిన డీఏను పెంచి మరీ ఇస్తుండడంపై సీఎంను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని కలిశారు. ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్ నుంచి 7 స్టార్ హోటల్స్ నిర్మాణానికి మహీంద్ర గ్రూప్ సంసిద్దత వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగాభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. పలు పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రేపు, ఎల్లుండి సీఎం వైఎస్ జగన్ తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు(సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకోనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
ఏపీలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలను సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా జగన్ సర్కారు ముందుకు సాగుతోంది. ఇవాళ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభం కాను�