ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు.
భగీరథ మహర్షి జయంతి సందర్బంగా క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా భగీరథ మహర్షి చిత్రపటానికి ముఖ్యమంత్రి జగన్ నివాళులు అర్పించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్‌లో అనంతపురం జిల్లాలోని నార్పల నుంచి పుట్టపర్తికి వెళ్లాల్సి ఉండగా.. సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది.
చిలకలూరిపేట సభలో ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. స్కామ్‌లే తప్ప.. స్కీమ్‌లు తెలియని బాబులు అంటూ ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. అధికారంలో ఉండగా దోచుకో.. పంచుకో.. తినుకో.. డీపీటీ మాత్రమే వారికి తెలుసని ఆయమ మండిపడ్డారు.
ఒక రాజకీయ పార్టీకి విశ్వసనీయత మేనిఫెస్టో అని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రతి హామీ మతగ్రంథంగా పవిత్రంగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలలో ఒక రాజకీయ పార్టీ ఇచ్చిన హామీలు పవిత్రమైనవిగా భావిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.
నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నుంచి ఊరట లభించింది. సీబీఐ కోర్టులో రోజువారీ విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.