ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సొంత జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు అన్నమయ్య, కడప జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది.. దీని కోసం ఇవాళ ఉదయం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. ఉదయం 12 గంటలకు రాయచోటి చేరుకుంటారు.
ఈ నెల 9, 10 తేదీల్లో సీఎం వైఎస్ జగన్ అన్నమయ్య, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 9న ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. ఉదయం 12 గంటలకు సీఎం జగన్ రాయచోటి చేరుకోనున్నారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ కుమారుడు వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరుకానున్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సామాజిక సాధికారిత కోసం ఎంతో మంది పోరాటాలు చేశారని మంత్రి చెప్పారు.
జగనన్న ఆరోగ్య సురక్ష, 'వై ఏపీ నీడ్స్ జగన్' క్యాంపెయిన్లపై కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. దాదాపు 98శాతం గ్రామ, 77 శాతం వార్డు సచివాలయాల్లో వైద్య శిబిరాల నిర్వహణ పూర్తయ్యిందని ఈ సందర్భంగా సీఎం జగన్ వెల్ల�
మాజీ మంత్రి కొడాలి నాని మేనకోడలు వివాహా వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కంకిపాడు అయాన కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వేడుకలో వధువు డా.స్నేహ, వరుడు డా.అనురాగ్ దీపక్‌లను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. అక్టోబరు 15వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు.. 24వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దర్శించుకోనున్నారు.
విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద 'న్యాయానికి సంకెళ్లు ఇంకెన్నాళ్లు'.. నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
అమిత్ షా-లోకేష్ భేటీపై పురంధేశ్వరి స్పందించారు. లోకేష్‌ను అమిత్ షా పిలిచారా..? లేక లోకేష్ అడిగారా..? అనేది అప్రస్తుతమని.. వారిద్దరి మధ్య భేటీ జరిగిందన్నారు. చంద్రబాబుపై ఏయే కేసులు పెట్టారు..? ఏయే బెంచ్‌ల మీదకు కేసులు వెళ్లాయని అమిత్ షా అడిగారని ఆమె వెల్లడించారు
పేద వారికి అభివృద్ధి చేయాలంటే నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అక్కర్లేదని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. మాటిస్తే మాట నిలబెట్టుకునే తత్త్వం సీఎం జగన్‌ది అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.