Andhrapradesh: విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏపీ సర్కారు నిర్మించనుంది రూ. 8,480 కోట్ల వ్యయంతో మొత్తం17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతోంది. దీంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య భారీగా పెరుగనుంది. ఇప్పటికే ఉన్న 2,185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2,550 ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి.
Also Read: Off The Record: ఎక్కడ.. ఎంపీ సాబ్.. నియోజకవర్గం ముఖం చూసి ఏళ్లు గడుస్తోంది..!
సీఎం జగన్ పర్యటన ఇలా..
నేడు వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాకు రానున్నారు. ఉదయం 10.30 గంటలకు జేఎన్‌టీయూ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడ నుంచి 10.45 గంటలకు వైద్య కళాశాల ప్రాంగణానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం వైద్య కళాశాల ప్రారంభానికి సంబంధించిన శిలాఫలకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, స్కిల్ ల్యాబ్‌లను సందర్శించనున్నారు. అనంతరం బయోకెమిస్ట్రీ ల్యాబ్, అనాటమీ మ్యూజియం పరిశీలించనున్నారు సీఎం జగన్. 11.30 గంటలకు లెక్చర్ హాలుకు చేరుకొని రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు సందేశాలను ఇస్తారని, అనంతరం ఐదు కళాశాలల వైద్య విద్యార్ధులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. తరువాత హెలిప్యాడ్‌కు సమీపాన ఏర్పాటు చేసిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు.