AP CM Jagan: నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆపన్నహస్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సామర్లకోట పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ వద్ద వివిధ వైద్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సహాయం కోరుతూ ముఖ్యమంత్రికి వినతులు అందించగా.. తప్పకుండా ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు లబ్ధిదారుల అవసరాలకు ఇచ్చే నిమిత్తం శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లో 17 మంది బాధితులకు లక్ష రూపాయలు చొప్పున చెక్కులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేతులు మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా పలువురు బాధితుల సమస్యలు విని తక్షణమే స్పందించి వారికి ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని తమకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
Also Read: AP High Court: రేపు, ఎల్లుండి ఎస్సై పరీక్షలు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
Also Read
దీనిలో భాగంగా ఈరోజు 17 మందికి లక్ష రూపాయలు చొప్పున రూ.17లక్షలు చెక్కులు బాధితులకు పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీధర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జె.నరసింహ నాయక్, జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డా. పి.రాధాకృష్ణ, కలెక్టరేట్ ఏవో జీఎస్ఎస్ శ్రీనివాసు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. శస్త్రచికిత్సల కోసం కొందరు, ఇతర ఆరోగ్య సేవల కోసం మరికొందరు తమకు సహాయం చేయాలని అడిగిన వెంటనే ముఖ్యమంత్రి చేసిన సహాయానికి లబ్ధిదారులు మనసారా ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!