ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ఏలూరు జిల్లా పర్యటించనున్నారు. ఏలూరు జిల్లాలోని దెందులూరులో సిద్ధం సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు. సిద్ధం ఎన్నికల శంఖారావం సభకు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా నుంచి లక్షలాది మంది క్యాడర్ హాజరు కానున్నారు.
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా కింద లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిధులను విడుదల చేశారు.
ఏపీ ప్రభుత్వం కొత్తగా పెళ్లి చేసుకున్నవారికి ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయింది. పేద కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద శుక్రవారం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగదు జమ చేయనున్నారు.
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్.జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్పందన, జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకం, నాడు – నేడుపై సీఎం సమీక్షించారు.
మాటల కంటే చేతలు ముఖ్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జగన్ అంటేనే విద్యాలయాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. నాడు నేడు పథకంలో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మంచి విద్య అందేలా స్కూళ్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన అన్నారు.
విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహ్వానితుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ, యాపిల్ సీఈవో టిమ్ కుక్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల ఉన్నారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఆయన నాలుగు రోజుల క్రితం కందుకూరులో రోడ్ షో నిర్వహించగా తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనను మరువకముందే ఇవాళ చంద్రబాబు గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో వస్త్రాల పంపిణీకి నిర్వహించిన బహ�