ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటన ఖరారైంది. డిసెంబర్ 2, 3 తేదీల్లో లింగాల, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీకి అమెరికా కోర్టు సమన్లు జారీ చేసింది. అవినీతి, పెగాసస్ స్పైవేర్, అమెరికాకు నగదు తరలింపు తదితర ఆరోపణలతో ఓ భారతీయ అమెరికన్ వైద్యుడు దావా వేశారు.
విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశంలోనే మొదటిసారిగా మైక్రోసాఫ్ట్ సంస్థ విద్యార్థులకు శిక్షణ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి చదువుకోవాలని ఆయన అన్నారు.
రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు. ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలు దేరి.. 10.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు.
మన స్వాతంత్య్ర పోరాటం మహోన్నతమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా అని ఆయన పేర్కొన్నారు . పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు.
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరగనుంది. సంస్థ ఛైర్మన్, ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షత వహిస్తారు. ఈ భేటీలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారు.
టాలీవుడ్ లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స జరుగుతోంది. 86 ఏళ్ల కైకాల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా అప్పటి నుండి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను పరామర్శిస్తు�