భూముల రీ-సర్వేపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్. భూముల రీ-సర్వే అనేది సీఎం జగన్ మానస పుత్రిక. ప్రతి 30 ఏళ్లకోసారి రీ-సర్వే చేయాలని నిబంధనలు.కానీ పొలం గట్ల తగాదాలు వస్తాయి.. పెద్ద గొడవలు అవుతాయనే ఆందోళనతో ఎవ్వరూ రీ-సర్వే చేయించేందుకు సాహసించ లేదు. దీంతో ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి సర్వే వివరాలే ఉన్నాయన్నారు.
కానీ సీఎం జగన్ సాహసంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రీ-సర్వేలో భాగంగా ఏమైనా తేడాలుంటే.. వాటిని పరిష్కరించేందుకు మొబైల్ కోర్టుల ఏర్పాటు చేశాం.కోర్టులో తగాదాలు ఉన్నవి తప్ప.. మిగిలిన భూ సమస్యలను పరిష్కరించాలని నిర్ణయం.ఏడాదికి మొత్తంగా పది లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతోంటే.. గ్రామాల్లో 5 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.రెవెన్యూ రికార్డులనేవి లైవ్ రికార్డు.
ప్రస్తుతమే కాకుండా.. భవిష్యత్తులో కూడా ఇబ్బందులు రాని వ్యవస్థను సిద్దం చేస్తున్నాం.ఆటో మ్యూటేషన్ కోసం అవసరమైన చట్ట సవరణ చేపడుతున్నాం.ఇక నుంచి మ్యూటేషన్లు తిరస్కరించాలంటే ఆర్డీఓకి పంపాల్సిందే.ఓ సర్వేలో కొంత భాగాన్ని అమ్మాలంటే సర్వేను సబ్ డివిజన్ చేయాల్సి ఉంటుంది.చుక్కల భూముల సమస్యకు పరిష్కారం తెచ్చాం.2017 నాటికి ఆర్ఓఆర్ రికార్డుల్లో పేరు ఉండడంతో పాటు.. దాని కంటే 12 ఏళ్ల పాటు కంటిన్యూగా పేరు ఉంటే.. క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాం.కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియని సులభతరం చేస్తున్నాం.గతంలో దరఖాస్తుదారు.. లేదా.. అతని తండ్రి కుల ధృవీకరణ పత్రాలు తీసుకుంటే.. వెంటనే ఇచ్చేస్తున్నాం.
ఆదాయ ధృవీకరణ పత్రాలను కూడా రేషన్ కార్డు ఆధారంగా జారీ చేస్తాం.ఇప్పటి వరకు 430 గ్రామాల్లో రీ-సర్వే పూర్తైంది.రీ-సర్వే చేయడం ద్వారా పొలం గట్లు జరిపేస్తామనే భ్రమలు వద్దు. రీ-సర్వేలో పొలం గట్లు జరపం.. అనుభవదారులను తప్పించం. రీ-సర్వేలో భాగంగా ఏమైనా తేడాలుంటే నోటీసులిచ్చి.. మళ్లీ సర్వే చేపడతాం. రీ-సర్వే పూర్తైన 430 గ్రామాల్లో పెద్దగా తేడాలు ఏం రాలేదు.గతంలో చేసిన సర్వేల్లో 5 శాతం తేడాలను అనుమతించవచ్చని నిబంధనలే ఉన్నాయి. 2023 ఏడాది చివరికల్లా రీ-సర్వే కార్యక్రమం పూర్తి చేసేస్తాం అన్నారు సాయిప్రసాద్.