నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆత్మకూరు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రైతు సోదరుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, టీజీ వెంకటేష్. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీజేపీ నేతలు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో రాష్ట్ర మంత్రులు ఉండి కూడా ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు.…
ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. నలుగురు వైసీపీ అభ్యర్ధులు ఏకగ్రీవం అయ్యారు. రాజ్యసభ ఎంపీలుగా వైసీపీ నుంచి నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ చేతుల మీదుగా డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, కృష్ణయ్య, బీద మస్తాన్ రావు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ… రాజ్యాధికారంలో బీసీలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. బీసీలకు మాటలు కాకుండా చేతల్లో అభివృద్ధి చూపిస్తున్నారు.సీఎం జగన్ దేశానికి…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనపై సీరియస్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.తులసిరెడ్డి. దావోస్ పర్యటన ఓ గండికోట రహస్యమంటూ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మేలు చేయాలంటే వెళ్లాల్సింది దావోస్ కి కాదని, ఢిల్లీకి అని ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తే దావోసే ఏపీకి పరిగెత్తుకు వస్తుందన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు, దుగ్గరాజపట్నం ఓడరేవు, విశాఖ కారిడార్, విశాఖ ఉక్కును కాపాడటం…
మూడు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు జగన్ పెట్టిన వైసీపీ పార్టీ చరిత్ర సృష్టించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాలను, 25 పార్లమెంట్ స్థానాలకు గాను 22 స్థానాలను కైవసం చేసుకొని కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు మెజారిటీతో ఏపీ లో అధికారాన్ని చేపట్టింది. అయితే జగన్ అధికారం చేపట్టి నేటితో సరిగ్గా మూడు సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్బంగా సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 6న నామినేషన్లకు చివరి గడువు, జూన్ 23న పోలింగ్ జరగనుంది. ఈనెల 26న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఉప ఎన్నిక కోసం విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా హరేంధిర ప్రసాద్ వ్యవహరించనున్నారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారుల నియామకం జరిగింది. దివంగత మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి ఫిబ్రవరి 21వ తేదీన హఠాన్మరణానికి గురైన సంగతి…