ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనపై సీరియస్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.తులసిరెడ్డి. దావోస్ పర్యటన ఓ గండికోట రహస్యమంటూ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మేలు చేయాలంటే వెళ్లాల్సింది దావోస్ కి కాదని, ఢిల్లీకి అని ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తే దావోసే ఏపీకి పరిగెత్తుకు వస్తుందన్నారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు, దుగ్గరాజపట్నం ఓడరేవు, విశాఖ కారిడార్, విశాఖ ఉక్కును కాపాడటం ఇలా ఎన్నో అంశాలు ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉంటే దావోస్‌కు వెళ్లి సీఎం జగన్ ఒట్టి చేతులతో వచ్చారని ఆరోపించారు. రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదని అందుకే కాంగ్రెస్ దేన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని తులసిరెడ్డి అన్నారు.
జూన్ 4,5 తేదీల్లో కడప ఇందిరా భవన్‌లో రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ మేథో మధన సదస్సు జరుగుతుందని చెప్పారు. 150 మంది ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా హాజరవుతారన్నారు. అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఉమెన్ చాందీ, మెయిప్పన్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ పిసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఈ సదస్సుకి హాజరు కానున్నట్లు తులసిరెడ్డి చెప్పారు.తరచుగా జగన్ పాలనపై తులసిరెడ్డి ఘాటైన విమర్శలు చేస్తున్నారు.
Singer KK: కేకే మృతి పై అనుమానాలు.. తల, ముఖం పై గాయాలు