అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. ఆయనతో పాటు మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన మేకపాటి విక్రమ్ రెడ్డి సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికయిన విక్రమ్ రెడ్డి, పార్టీ నేతలను అభినందించారు సీఎం వైఎస్ జగన్. ఇటీవల జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. క్యాంపు కార్యాలయానికి వచ్చిన మేకపాటి విక్రమ్ రెడ్డిని వైసీపీ నేతలు అభినందించారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ అభ్యర్ధులే ప్రధానంగా తలపడ్డారు.మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక నిర్వహించారు.
ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీకి 1,02,240 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ 19,352 ఓట్లే వచ్చాయి. ఆత్మకూరులో బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్‌రెడ్డి 82,888 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం 20 రౌండ్లకు గానూ రౌండ్ రౌండ్‌కు మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆధిక్యం పెరుగుతూనే వచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ వైఎస్ఆర్ సీపీ ఆధిక్యం కనబరచిన సంగతి తెలిసిందే. తిరుపతి, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ వరుస ఓటములు చవిచూసింది. గత సంప్రదాయాలకు అనుగుణంగా టీడీపీ ఆత్మకూరులో పోటీచేయలేదు.
ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్‌రెడ్డికి ఘన విజయాన్ని అందించిన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. “ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా.. ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్రమ్‌ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి.. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు.. పేరుపేరునా ధన్యవాదాలు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష“ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
CPI Narayana : ఖచ్చితంగా ఈడీ ఓ “బ్లాక్ షీప్”