AP Budget Session 2025: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సెషన్‌కు డేట్ ఫిక్స్ చేశారు.. ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. మూడు వారాలు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టుంగా తెలుస్తోంది.. అయితే, మొదటి రోజు బీఏసీ సమావేశం తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలి అనే అంశంపై ఓ నిర్ణయానికి రానున్నారు ఏపీ శాసన సభ స్పీకర్ నిమ్మకాయల అయ్యన్నపాత్రుడు.. ఈ నెల 28వ తేదీన లేదా వచ్చే నెల 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు.. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తిస్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలంటూ ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టుగా తెలుస్తోంది..
Read Also: Minister Nimmala Ramanaidu: విధ్వంసకారుడే.. విధ్వంసం గురించి చెప్పడం ఈ శతాబ్దపు విడ్డూరం..!
మరోవైపు.. కేంద్రం 2025-26 బడ్జెట్‌ను ఇప్పటికే ప్రవేశపెట్టింది.. మన రాష్ట్రానికి ఏ మేరకు ప్రయోజనాలు లభిస్తాయో వివరాలు తెలియజేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ ప్రభుత్వ శాఖలను ఆదేశించడం.. రాష్ట్రానికి ఏ మేరకు ప్రాజెక్టులు, నిధులు రానున్నాయి.. ఏ శాఖకు ఎన్ని నిధుల వచ్చే అవకాశంఉందో ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చింది.. ఇక, కేంద్ర బడ్జెట్ 2025-26ను బట్టి.. రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ 2025-26పై కసరత్తు చేస్తోంది.. ఇప్పటికే వివిధ శాఖల నుంచి వివరాలను తెచ్చుకొని బడ్జెట్ రూపకల్పనపై దృష్టిసారించింది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోయింది. అంతకు ముందు ఉన్న వైసీపీ సర్కారు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేసిందని ఆరోపిస్తూ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేలా పరిస్థితులు లేవని చెప్పుకొచ్చిన కూటమి సర్కార్.. ఓటాన్ అకౌంట్‌తోనే నెట్టుకొచ్చిన ప్రభుత్వం.. మరోసారి నవంబర్‌లో అదే ఫాలో అయిపోయింది.. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పది నెలల తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి సిద్ధమవుతోంది.