CM Chandrababu: నా దగ్గర డబ్బులు లేవు కానీ.. నూతన ఆలోచనలు ఉన్నాయి: సీఎం
- రాష్ట్ర ఆస్తులు కాపాడతాం
- అమ్మాయిలకు రక్షణ కల్పిస్తాం
- ధనిక రాష్ట్రాలు కూడా ఇంత పింఛన్ ఇవ్వడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన దగ్గర డబ్బులు లేవని, కానీ నూతనమైన ఆలోచనలు మాత్రం ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 6 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాం అని, ఆదాయం స్వీడ్‌గా వస్తుందన్నారు. 1వ తేదీనే 64 లక్షల 50 వేల మందికి పింఛన్, జీతాలు ఇస్తున్నాం అని.. ధనిక రాష్ట్రాలు కూడా ఇంత పింఛన్ ఇవ్వడం లేదన్నారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు. రాష్ట్ర ఆస్తులు కాపాడతాం అని, అమ్మాయిలకు రక్షణ కల్పిస్తాం అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. బడ్జెట్‌పై శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు.
‘రాష్ట్ర ఆదాయం 13.5 శాతం పెరిగితే 76 వేల కోట్లు వొచ్చేది. తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ జీడీపీ అంచనా వేసుకునే వాళ్లం. 2014 నుండి 2019 వరకు 13 వేల కోట్లు తెలంగాణ కంటే జీఎస్టీ ఎక్కువగా ఉంది. 2023 నాటికి తెలంగాణకి 60 వేల కోట్లు ఎక్కువ వొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఒక్కరిపై లక్ష 35వేల రూపాయలు అప్పు ఉంది. గత పాలకులు అభివృద్ధి చేయకుండా.. బటన్ మాత్రమే నొక్కారు. బటన్ నొక్కితే ఏమైనా వొచ్చిందా?. ప్రవేట్ సంస్థలు రాలేదు.. అనేక ప్రవేట్ కంపెనీలు రాష్ట్రం వదలి వెళ్లిపోయాయి. పెట్టుబడిదారులు ఏపీపై నమ్మకం కోల్పోయారు. 25వేల కేసులు ప్రభుత్వంపై వేశారు. అధికారులు కోర్టులో చేతులు కట్టుకుని నిలబడ్డారు. సంపద లేదు.. ఆదాయం పెరగలేదు. ఆదాయం తగ్గడంతో ఆస్తులు తాకట్టు పెట్టారు. అప్పులు, వడ్డీ, జీతాలు.. ఇలా రాష్ట్రంలో అగాధంలోకి వెళ్ళిపోతుంది’ అని అన్నారు.
Also Read
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
- Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
- Harish Rao : హరీశ్ వర్సెస్ కాంగ్రెస్.. ఇక కోర్టులోనే.!
Also Read: CM Chandrababu: నా జీవితంలో ఇలాంటి విజయాన్ని చూడలేదు: సీఎం చంద్రబాబు
‘7 శ్వేత పత్రాలు విడుదల చేశాం. ప్రజలలో కూటమి ప్రభుత్వంపై అంచనాలు బాగా పెరిగాయి. రాష్ట్రం వెంటిలేటర్పై ఉంది. ఆస్తులు అమ్మాలి అన్నా.. లేకుండా చేశారు. రోజులు, గంటలు, నిమిషాలు లెక్కపెట్టుకొంటున్నాం. నా దగ్గర డబ్బులు లేవు కానీ.. నూతనమైన ఆలోచన ఉంది. 6 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాం. ఆదాయం స్వీడ్‌గా వస్తుంది. 1వ తేదీనే 64 లక్షల 50 వేల మందికి పింఛన్ ఇస్తున్నాం. జీతాలు కూడా ఇస్తున్నాం. ధనిక రాష్ట్రాలు కూడా ఇంత పింఛన్ ఇవ్వడం లేదు. 200 పైన అన్న క్యాంటీన్లు పెట్టాం. పేదవాడికి అన్నం పెట్టేదానికి ఎక్కడ అంతరాయం ఉండదు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే చూస్తూ ఉరుకోము. ఆస్తులు కాపాడతాం, అమ్మాయిలకు రక్షణ కల్పిస్తాం. రాబోయే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం చేసినా గోదావరి నుండి పెన్నా వరకు నీరు అందిస్తాం. సూపర్ 6లో దీపం 2 ఇచ్చాం. లక్షల కోట్ల రూపాయలకు శ్రీకారం చుడుతున్నాం. మన మీద నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయి. మరలా వైసీపీ అధికారంలోకి రాదు. చెత్తపై పన్ను తొలగించాం. వైసీపీ గుంతలు చేసి పోతే.. పూడ్చే పని మేము చేస్తున్నాం. 55 వేల కోట్లు నేషనల్ హైవేకి కేటాయిస్తున్నాం. 10 శాతం మద్యం షాపులను గీత కార్మికులకు కేటాయించిన ప్రభుత్వం మాదే’ అని సీఎం చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!