కేంద్ర బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిని మార్చాలని నిర్ణయించింది. ఈ విషయమై జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితం సోము వీర్రాజుకు ఫోన్ చేశారు. 'మీ పదవీకాలం ముగిసింది.. మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. మీరు రాజీనామా చేయండి' అని నడ్డా తనకు సూచించినట్లు వీర్రాజు స్వయంగా తెలిపారు.
బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుకు కోపం వచ్చింది. రాజకీయాలను రాజకీయాలుగా చూడకుండా.. పాత విషయాలను పదేపదే ప్రస్తావించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారా? అందుకే ఎన్నడూ లేనివిధంగా అధికారపార్టీపై విరుచుకుపడ్డారా? అయితే 2024 తర్వాత రాజకీయాలకు గుడ్‌బై కొట్టేస్తానని ఎందుకు చెప్పారు? ఇది ఆగ్రహమా..? అసహనమా..? 2024 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన..! ప్రత్యర్థులను.. అందులోనూ టీడీపీని.. ఆ పార్టీ నేతలను విమర్శించడంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫ్రంట్ లైనులో ఉంటారు. అలాంటిది అధికార…
ఈరోజు ఏపీ శాసనసభలో జరిగిన విషయమై స్పందించారు ఏపీ బీజేపీ అగ్ర నేతలు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ… ఈ రోజు శాసన సభలో పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. శాసనసభ హుందాతనం, గౌరవం కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం అన్నారు. ఈరోజు జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా సీఎం జగన్ బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగత విమర్శలు హృదయాలను గాయపరుస్తాయి. ఈ రోజు సంఘటన శాసనసభకు మాయని మచ్చగా భావించాలి అని తెలిపారు.…
ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సోము వీర్రాజు. ఆయన మాట్లాడుతూ… జగనుకు మోడీ భయం పట్టుకుంది. మోడీతో జగన్ ఢీ అనాలనుకుంటే మేమూ సిద్ధంగా ఉన్నాం. మేము ఏంటో ఏపీ ప్రభుత్వానికి చూపిస్తాం. కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇస్తారా అని ప్రశ్నించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు టాక్సులు తగ్గించినప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించదు. మేము సాయం చేస్తేనే ఏపీని పరిపాలిస్తామని ఎన్నికల…
బద్వేల్ లో బీజేపీ నైతికంగా విజయం సాధించింది అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బద్వేల్ లో 40వేల ఓట్లను వైసీపీ రిగ్గింగ్ చేసింది. మేము ఏం చేశామో పాంప్లెట్ ఇచ్చి ఓటు అడిగాము. వైసీపీ వెయ్యి నోటు ఇచ్చి ఓటు అడిగింది. బద్వేల్ లో మేము ధర్మపోరాటం చేశాం, వైసీపీ అధర్మ యుద్ధం చేసింది. రెండున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించింది. సీఎం సొంత జిల్లాలో ఓట్లు కొనుక్కునే దుస్థితి వైసీపీకి వచ్చింది.…
బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేనను పోటీ చేయాలని కోరినట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తెలిపారు. సంప్రదాయాలను గౌరవిస్తూ పోటీకి దూరంగా ఉంటామని జనసేన చెప్పింది అని వివరించిన ఆయన కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం… కాబట్టి బీజేపీ బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని అన్నారు. అభ్యర్థులను ఖరారు చేయాల్సిందిగా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కోరాం అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇస్తుందో లేదోననే అంశంపై ఆ పార్టీతో చర్చిస్తాం.…
మోడీ బర్త్ డే రోజున 2 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని ప్రణాళిక చేస్తున్నాం అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రేషన్ బియ్యం కి రెండు రూపాయలు సబ్సిడీ ఇచ్చి జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ప్రజలకు వ్యాక్సిన్ అందించినందుకు 5 కోట్లు పోస్ట్ కార్డులతో కృతజ్ఞతలు చెప్పాలని నిర్ణయం తీసుకున్నాము. మోడీ జన్మదిన వేడుకలను 20 రోజుల పాటు రోజుకో ప్రాధాన్యతా కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. స్వచ్చ భారత్, మన్ కీ…
ఆయన నిన్నమొన్నటి వరకు నోటికి పనిచెప్పేవారు. సడెన్‌గా ఉత్తరాలతో కొత్త రూటు ఎంచుకున్నారు. సీఎమ్‌కు వారానికో లేఖ రాసిపారేస్తున్నారు. ఈ లెటర్ల వెనక ఆంతర్యం ఏదైనా.. లేఖల ప్రభావం భారీగానే ఉందని లెక్కలు వేసుకుంటున్నారట. ఆయన ఎవరో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. నోటికి పని తగ్గించి… లేఖలు రాస్తున్న వీర్రాజు..! సోము వీర్రాజు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు. ఆయన కామెంట్స్ సంచలనంగా మారిన సందర్భాలు అనేకం. కాకపోతే వీర్రాజు వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నాయనే…
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ధార్మిక విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు భగవత్ గీత పంపిణీ కార్యక్రమం బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ… కొన్ని షోషల్ మీడియా లో ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నం అంటూ వస్తున్నా వ్యతిరేకిస్తున్న.. ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి రాజ్యమేలుతుంది. వైసీపీ పార్టీ అవినీతి పైన బిజిపి పార్టీ యాత్ర చేపట్టి..…