ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డ సోము వీర్రాజు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సోము వీర్రాజు. ఆయన మాట్లాడుతూ… జగనుకు మోడీ భయం పట్టుకుంది. మోడీతో జగన్ ఢీ అనాలనుకుంటే మేమూ సిద్ధంగా ఉన్నాం. మేము ఏంటో ఏపీ ప్రభుత్వానికి చూపిస్తాం. కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇస్తారా అని ప్రశ్నించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు టాక్సులు తగ్గించినప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించదు. మేము సాయం చేస్తేనే ఏపీని పరిపాలిస్తామని ఎన్నికల ముందు ఎమ్మెల్యే పార్థసారథి ఎందుకు చెప్పలేదు. వైసీపీకి ఓట్లు వేస్తే ప్రత్యేక హోదా, రాజధాని తెస్తామని ప్రజలను మోసం చేశారు. ఏపీలో జాతీయ రహదారులను అభివృద్ధి చేసాం. రాజధాని ఇక్కడే ఉండాలని మేము అభివృద్ధి చేస్తున్నాం. ఏపీలో రూ. 2500 కోట్లు రాజధానికి ఇచ్చాం.. రూ. 4700 కోట్ల రుణం ఇప్పించాం. రోడ్లపై గోతులు పూడ్చలేని జగన్ ప్రభుత్వం.. గోతులు తవ్వే రాజకీయాలు చేయడం సరికాదు. మాట ఇచ్చి రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు. రాజధానిపై ఇచ్చిన మాటను ఎందుకు తప్పారు. రాజధాని నిర్మాణం పేరుతో రూ. 4 సెస్ వసూలు చేస్తూ రాజధాని ఎందుకు నిర్మించడం లేదు అని ప్రశ్నించారు.
ఇక రాజధాని నిర్మిస్తామని ఒకరు పారిపోయారు. అస్తవ్యస్తం నిర్ణయాలతో ఆంద్ర రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వానికి చర్చకు రావాలని ఛాలెంజ్ విసురుతున్న. మేము ఎంత పెంచామో ఎంత తగ్గించామో చాలా స్పష్టంగా చెప్పాం. దేశంలో ప్రజలపై భారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, అయిల్ ధరలు తగ్గించింది. ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. ఏపీ దేశంలో ఉందా లేదా అనేది జగన్ చెప్పాలి. పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో ప్రభుత్వ వైఖరి వితండవాదంగా ఉంది. ప్రజాధనం వినియోగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను ఆదుకుంది. ఏపీకి కూడా అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం సహాయం చేసింది. ఆత్మ నిర్భర భారత్ కింద కేంద్రం ఏపీకి సాయం చేసింది అని ప్రశ్నించారు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
ట్రెండింగ్
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!