తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ధార్మిక విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు భగవత్ గీత పంపిణీ కార్యక్రమం బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ… కొన్ని షోషల్ మీడియా లో ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నం అంటూ వస్తున్నా వ్యతిరేకిస్తున్న.. ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి రాజ్యమేలుతుంది. వైసీపీ పార్టీ అవినీతి పైన బిజిపి పార్టీ యాత్ర చేపట్టి.. వైసీపీ అక్రమాలు ప్రజలకు తెలిసేలా చేస్తాం. అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ని అప్పులు ప్రదేశ్ గా మార్చిన ఘనత ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి. విజయవాడ లో తెలుగు తల్లి విగ్రహం తొలగించడం వైసీపీ పార్టీ మూర్ఖత్వంకి నిదర్శనం అని పేర్కొన్నారు.