మోడీ బర్త్ డే రోజున 2 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని ప్రణాళిక చేస్తున్నాం అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రేషన్ బియ్యం కి రెండు రూపాయలు సబ్సిడీ ఇచ్చి జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ప్రజలకు వ్యాక్సిన్ అందించినందుకు 5 కోట్లు పోస్ట్ కార్డులతో కృతజ్ఞతలు చెప్పాలని నిర్ణయం తీసుకున్నాము. మోడీ జన్మదిన వేడుకలను 20 రోజుల పాటు రోజుకో ప్రాధాన్యతా కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. స్వచ్చ భారత్, మన్ కీ బాత్, రక్తదాన శిబిరాలు, మోడీ జీవిత విశేషాల ప్రదర్శన పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టారు.
ఇక వినాయచవితి సందర్భంగా ప్రభుత్వ తీరును ఎండగట్టాం. బీజేపీ తోక పార్టీగా మారిందని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించాడు. మాది తోక పార్టీ కాదు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఎవరి తోకలు ఎప్పుడు కత్తిరిస్తామో వెయిట్ చేయండి అని పేర్కొన్నారు. చంద్రబాబు రాస్తే నేను సంతకం చేశానని మాట్లాడే అర్హత లేదు. తోక పార్టీ అనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అన్న ఆయన పిషరీష్ శాఖ బడ్జెట్ ఎంతో మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పలేడు అని తెలిపారు.