అసెంబ్లీలో సోమవారం నాటి పరిణామాలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. సభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళన నిర్వహించి ప్రసంగం ప్రతులను చించివేయడం సరికాదని బీఏసీ సమావేశంలో సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలని, అలాంటిది కాగితాలు చించి ఆయనపై విసరడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని టీడీపీ నేత అచ్చెన్నాయుడు వద్ద సీఎం…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నాడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశమైంది. సభా నాయకుడి హోదాలో సీఎం జగన్, సభా వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, వైసీపీ తరఫున ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్…
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. కోవిడ్ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నాం. ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం. 2020-21 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధిస్తుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. వైయస్ఆర్ చేయూత ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు రూ.9,100 కోట్లు అందించామని…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ విపక్ష, అధికార పక్ష నేతల మధ్య మాటల యుద్ధం హోరెత్తే అవకాశం కనిపిస్తోంది. మూడు సంవత్సరాలుగా టీడీపీ సభ్యులను అవమానాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు శాసనసభలో టీడీపీ ఉప నేత అచ్చెన్నాయుడు. ప్రతిపక్ష నాయకుడుతో పాటు కుటుంబ సభ్యులను సైతం అవమానిస్తున్నారు. శాసనసభా గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు మంట గలుపుతున్నారు. కర్తవ్య బాధ్యతను నెరవేర్చడం కోసం టీడీపీ తరపున సభకు హాజరు అవుతున్నాం. శాసనసభలో ఇన్ని ఇబ్బందులు, అవమానాలు ఎప్పుడు…
ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.11.30 కి అసెంబ్లీలో బడ్జెట్ పెట్టనున్న హరీష్ రావు. మండలిలో బడ్జెట్ పెట్ట నున్న శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి నేడు యూపీలో ఆఖరి, ఏడవ విడత అసెంబ్లీ ఎన్నికలు అనంతపురం జిల్లా ఉరవకొండ గవి మఠం శ్రీ చంద్ర మౌళీశ్వర స్వామి ఆలయంలో నేటినుంచి మహా రథోత్సవం వేడుకలు ప్రారంభం.వారం రోజుల పాటు జరగనున్న వేడుకలు. శ్రీకాకుళంలో మహిళా దినోత్సవం సందర్బంగా 7రోడ్ జంక్షన్…
ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్. బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్. మార్చి 7వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఒంగోలు దిశ పోలీస్ స్టేషన్ లో దిశ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించనున్న గుంటూరు రేంజ్ డీఐజీ సీ.యం.త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ మలిక గర్గ్ అన్నవరం దేవస్థానంలో అందుబాటులోకి వచ్చిన నిత్యాన్నదానం భోజనాల తయారీకి స్టీమ్ బాయిలర్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్…
టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం టీడీఎల్పీ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. సమావేశం అనంతరం అసెంబ్లీకి హాజరు కాకూడదని ప్రకటించనుంది టీడీఎల్పీ. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లరాదని ఇప్పటికే పొలిట్ బ్యూరోలో మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ కార్యక్రమాల నిర్వహణపై టీడీఎల్పీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు చంద్రబాబునాయుడు. మెజార్టీ ఎమ్మెల్యేలు మాత్రం బాబు లేకుండా వెళ్లిన లాభం లేదని భావించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7 తేదీనుంచి జరగనున్నాయి.…
ఏపీ వార్షిక బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఏపీ బడ్జెట్ సమావేశాలను మార్చి 7 నుంచి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మార్చి 7న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 8న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంతాపం తెలపనున్నారు. 9, 10 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. మార్చి 11 లేదా 14 తేదీల్లో…
ఏపీలో బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మార్చి నెలాఖరు వరకు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. సుమారు 15 నుంచి 20 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. మార్చి 7న తొలిరోజు సమావేశాల్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మృతి పట్ల అసెంబ్లీ సంతాపం వ్యక్తం చేయనుంది. మార్చి 8న ఉభయ సభలను ఉద్దేశించి…