ఏపీ అసెంబ్లీలో సోమవారం గందరగోళం నెలకొంది. ప.గో. జిల్లా జంగారెడ్డిగూడెం సారా మరణాలపై టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సభలో ప్రశ్నోత్తరాలు జరగకుండా అడ్డుకున్నారు. అనంతరం స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయులును బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు. వారిని సభ నుంచి…
ఏపీ అసెంబ్లీలో జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై రగడ జరుగుతోంది. ఈ అంశంపై సభలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి నీళ్లు ఇచ్చిందో లేదో కానీ లిక్కర్ మాత్రం ఇచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో ఎద్దేవా చేశారు. ATM (ఎనీ టైమ్ మందు) అనేలా చంద్రబాబు పాలన సాగిందని…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జగడం జరుగుతోంది. జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ పలుమార్లు సభను వాయిదా వేశారు. అయితే ఈ అంశంపై చర్చించాల్సిందేనని టీడీపీ నేతలు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేపట్టారు. సభలో టీడీపీ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ సభ్యులను ఉద్దేశిస్తూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మద్యపాన నిషేధం గురించి…
ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మండిపడ్డారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. రాష్ట్ర బడ్జెట్ చూస్తుంటే అప్పులు చేసి పథకాలకు పంచేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటట్లు ఉందన్నారు. ఏ ప్రాంతం అభివృద్ధి కోసం బడ్జెట్ లో ప్రస్తావన లేదు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టు లకు ఎందుకు నిధులు కేటాయించలేదు. మసిపూసి మారేడు కాయ చేసే బడ్జెట్ ఇది. ఏ ప్రాంతాన్ని ఆలోచింపచేసే బడ్జెట్ కాదు ఇది. బడ్జెట్ ను…
ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు మంత్రి కురసాల కన్నబాబు. మరో మంత్రి అప్పలరాజు శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మార్కెటింగ్ యార్డుల్లో నాడు-నేడు. మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి రూ. 614.23 కోట్లు. సహకార శాఖకు రూ.248.45 కోట్లు. ఆహార శుద్ధి విభాగానికి రూ.146.41 కోట్లు. ఉద్యానశాఖకు రూ.554 కోట్లు. పట్టు పరిశ్రమకు రూ. 98.99 కోట్లు. ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.421.15 కోట్లు. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.59.91 కోట్లు. వెంకటేశ్వర పశువైద్య…
అసాధ్యమయిన పనికి పూనుకోరాదు. ఒకవేళ పూనుకుంటే పూర్తయ్యేవరకూ వదలకూడదు జగనన్న ఇళ్ళ పథకానికి నిధులు కేటాయింపు అమ్మంటే అంతులేని సొమ్మురా.. అమ్మంటే తరగని భాగ్యమ్మురా.. అమ్మ ఒడిలోన స్వర్గం వుందిరా-బుగ్గన ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటే రికమండేషన్ లెటర్ల అవసరం అవుతున్నాయి అమ్మలకు 15 వేలు చొప్పన తల్లుల ఖాతాలకు డబ్బులు పంపిణీ లక్షల మంది విద్యార్ధినీ విద్యార్ధులకు లబ్ధి పాఠశాలల ఆధునీకరణ పనులు చేపట్టాం పాఠశాల విద్యను మధ్యలో వదిలేసేవారి కోసం ప్రత్యేక సదుపాయం పాఠశాల మరుగుదొడ్ల…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్కూల్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడారు. ‘‘సాధారణంగా చిరంజీవి కొత్త సినిమాలకు టిక్కెట్లు దొరకడం చాలా కష్టం. ఏపీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కూడా ఈరోజు అలాగే ఉంది. గతంలో ఏ ప్రభుత్వంలోనూ కనిపించని విధంగా నేడు ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ‘నో అడ్మిషన్స్’ బోర్డులు కన్పిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమైంది… ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చర్చనుప్రారంభించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో కూడా ఆర్థిక ప్రగతి బాగానే ఉందన్నారు.. కరోనా సమయంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు కూడా అందించామని.. పేదరికాన్ని తగ్గించాలంటే విద్యతోనే సాధ్యం.. అందుకే విద్యకే అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకం కూడా లేదంటే…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవరోజు కొనసాగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి.విద్యాశాఖ ప్రమాణాలు, పాఠశాలల్లో స్వీపర్ల వేతనాలపై గంటన్నరకు పైగా చర్చ జరిగింది. విదేశీ విద్య నిలిపేశారంటూ అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు. నాడు-నేడు పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయన్నారు విపక్ష సభ్యులు. అమ్మ ఒడి డబ్బుల్లో పరిశుభ్రత కోసం అంటూ కోత విధిస్తున్నారని.. నాడు-నేడు పనులు జాప్యం జరుగుతున్నాయన్న టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి లేవనెత్తారు. పెద్ద ఎత్తున జరుగుతోన్న పనులను పక్కన పెట్టి..…