ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై టీడీపీ నేతలు మండిపడుతూనే వున్నారు. అసెంబ్లీ జగన్ భజన సభలా మారింది. సభలో మాట్లాడకుండా మా గొంతు నొక్కారని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప. కల్తీ సారా,నకీలీ మద్యంపై సభలో చర్చించాలని ఆందోళన చేశాం. ముఖ్యమంత్రి సభలో అవాస్తవాలు చెప్పారు. ఇకనుంచి ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తాం. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. కల్తీ సారా మరణాలపై ప్రశ్నిస్తే…
ఏపీ అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన విమర్శలు చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి పెట్టకుండా కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి చేయాలని భావించారని ఆరోపించారు. ఆయన కట్టాలనుకున్నది రాజధాని కాదని.. నగరం మాత్రమే అని తెలిపారు. చాలా రాష్ట్రాల్లో నాలుగైదు వందల ఏళ్ల నుంచి నగరాలను అభివృద్ధి చేస్తే.. చంద్రబాబు…
ఏపీ సీఎం జగన్‌పై మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. టీడీపీని చూస్తేనే జగన్ భయపడుతున్నారని.. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి మద్యం పాలసీపై జగన్ ప్రకటన చేశారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సభలో టీడీపీ సభ్యులు ఉండే వాస్తవాలు బయటకు వస్తాయని సస్పెండ్ చేశారన్నారు. ప్రతిపక్ష నేతగా మద్య నిషేధంపై ఊరూరా తిరిగి హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక రూ.6వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని…
ఏపీ అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్‌లకు అనుమతి ఇచ్చారని.. ఈ బ్రాండ్‌లన్నీ చంద్రన్న కానుకలే అని జగన్ ఆరోపించారు. 2019 తర్వాత ఏపీలో ఒక్క మద్యం బ్రాండ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. త్రీ క్యాపిటల్స్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్లు లేనే లేవని, ఆయా బ్రాండ్లు ఉన్నట్లు సోషల్…
ఏపీ అసెంబ్లీలో మంగళవారం కూడా గందరగోళం చోటుచేసుకుంది. సభ ప్రారంభమైన వెంటనే జంగారెడ్డి గూడెం సంఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. పోడియం వద్దకు వస్తే చర్యలు తీసుకుంటామని స్పీకర్ ముందే హెచ్చరించినా టీడీపీ సభ్యులు మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో స్పీకర్ పలువురు టీడీపీ నేతలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ…
పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. పెగాసెస్ వ్యవహారంపై చేసిన కామెంట్లు ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పుట్టించాయి.. ఇప్పటికే ఈ వ్యవహారంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. అయితే, ఏపీ అసెంబ్లీలోనూ పెగాసెస్ ప్రస్తావన వచ్చింది… చంద్రబాబు పెగాసెస్ స్పై వేర్‌ను వినియోగించారన్న మమతా బెనర్జీ కామెంట్లపై చర్చకు సిద్ధమైంది అధికార వైసీపీ.. అయితే, పెగాసెస్ పై చర్చకు నోటీసివ్వాలన్న స్పీకర్ తమ్మినేని సూచించగా… ఇప్పటికే నోటీసు ఇచ్చినట్టు చీఫ్ విప్…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనడం.. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం నిత్యం జరుగుతోంది.. ఇక, ఇవాళ కూడా జంగారెడ్డిగూడెం మరణాల అంశంపై సభలో చర్చకు పట్టుపట్టారు ప్రతిపక్ష సభ్యులు.. స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు.. జంగారెడ్డి గూడెం మరణాలపై జుడీషియల్ విచారణకు డిమాండ్ చేశారు.. అయిలే, మార్షల్స్ సహకారంతో సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లేటట్లు చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. కానీ, బల్లలు చేరుస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్నారు.. మూడు రోజుల గ్యాప్ అనంతరం ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాలు… ప్రశ్నోత్తరాలు, దేవదాయ, ఎక్సైజ్ శాఖలకు చెందిన బిల్లులను ఆమోదించనుంది సభ.. అసెంబ్లీలో వివిధ పద్ధులపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.. ఇక, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు ప్రగతిపై స్వల్ప కాలిక చర్చ సాగనుంది.. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చకు వచ్చే అంశాల విషయానికి వస్తే.. సీఎంఆర్ఎఫ్, మత్స్యకారులకు…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతీ రోజు నిరసనలు, ఆందోళనకు కొనసాగుతున్నాయి.. ఇప్పటికే పలు దఫాలుగా టీడీపీ సభ్యులను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.. ఇక, ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఏడోరోజు బడ్జెట్ సమావేశాల్లోనూ నిరసనలు తప్పలేదు.. మరోవైపు సభలోకి సెల్ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. దీనిపై స్పీకర్ తమ్మినేని రూలింగ్ ఇచ్చారు. అయితే, స్పీకర్ రూలింగ్‌పై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.. సభలో…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి… ఇవాళ కూడా సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. కల్తీ సారా మరణాలపై సీఎం వైఎస్ జగన్ సభను తప్పు దారి పట్టించారంటు స్పీకర్ పోడియం దగ్గర ఆందోళనకు దిగారు టీడీపీ సభ్యులు.. దీంతో సభ్యులను ఇవాళ ఒకరోజు సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై తీవ్రస్థాయిలో మండిపడ్డ నారాయణస్వామి.. టీడీపీ సభ్యులకు సవాలు…