ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవరోజు కొనసాగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి.విద్యాశాఖ ప్రమాణాలు, పాఠశాలల్లో స్వీపర్ల వేతనాలపై గంటన్నరకు పైగా చర్చ జరిగింది. విదేశీ విద్య నిలిపేశారంటూ అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు. నాడు-నేడు పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయన్నారు విపక్ష సభ్యులు.
అమ్మ ఒడి డబ్బుల్లో పరిశుభ్రత కోసం అంటూ కోత విధిస్తున్నారని.. నాడు-నేడు పనులు జాప్యం జరుగుతున్నాయన్న టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి లేవనెత్తారు. పెద్ద ఎత్తున జరుగుతోన్న పనులను పక్కన పెట్టి.. చిన్న చిన్న లోపాలను తప్పు పట్టడం సరికాదన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన. ప్రకాశం జిల్లాలో నాడు-నేడు పనులను ప్రారంభించి పక్కన పెట్టేశారని.. ప్రకాశం జిల్లాలో నాడు-నేడు పనులను పరిశీలిద్దామన్నారు వీరాజంనేయులు. పనులు ప్రారంభమయ్యాక పూర్తి కావడానికి టైమ్ పడుతుందని.. లైవ్ ఉంది కదా అని విమర్శలు చేయడం సరి కాదన్నారు బుగ్గన.