AP Assembly: ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల.. కాల్ చేసిన మంత్రి పయ్యావుల
- ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసిన కోరిన మంత్రి పయ్యావుల కేశవ్
- రేపు బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం స్వీకారం చేయించనున్న గవర్నర్
- ఈ నెల 21.. 22 తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించనున్న బుచ్చయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly: టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేశారు.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతోన్న తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిని కోరారు పయ్యావుల.. దీనికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంగీకారం తెలిపినట్టు చెబుతున్నారు.. దీంతో, రేపు బుచ్చయ్య చౌదరితో ముందుగా ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం స్వీకారం చేయించనున్నారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. అయితే, తెలుగు దేశం పార్టీలో సీనియర్ లీడర్ అయిన బుచ్చయ్య చౌదరి.. ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ఏడుసార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి బుచ్చయ్య చౌదరి.. ఇక, ఈ నెల 21, 22 తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తుంది.. ఈ సమావేశాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి సహా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు బుచ్చయ్య చౌదరి. ఆ తర్వాత స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.. స్పీకర్‌గా మరో సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పేరు వినిపిస్తోన్న విషయం విదితమే. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ స్థానం నుంచి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించిన విషయం విదితమే..
Read Also: Bomb Threat: చెన్నై-ముంబై ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ప్రయాణికులు సురక్షితం
Also Read
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
- One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!