15వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. క్వశ్చన్ అవర్‌తో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆయకట్టు స్థిరీకరణ, తోటపల్లి ప్రాజెక్ట్ ఆధునికీకరణ, పోలీస్ కానిస్టేబుళ్ల భర్తీపై సభ్యులు ప్రశ్నించనున్నారు. ఎస్ఐలకు డిఎస్పీలుగా ప్రమోషన్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలపై ప్రశ్నలు అడగనున్నారు. ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ రిపోర్ట్.. మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి సభ ముందు ఉంచనున్నారు. ఎస్సీ వర్గీకరణపై ఇవాళ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేయనుంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై స్వల్ప కాలిక…
బొబ్బిలి వీణ తయారీదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత హామీ ఇచ్చారు. వీణ తయారీకి 30 ఏళ్లు పెరిగిన పనస చెట్టు కలప మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని, రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పనస చెట్ల పెంపకానికి యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు. బొబ్బిలి చేనేత చీరల అమ్మకాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. హస్తకళాకారులను సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా లేపాక్షి షో రూమ్‌లు…
పాఠశాలల హేతుబద్ధీకరణపై సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేష్, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుధం కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా వెనుకబడి పోయాయని, ‘నాడు-నేడు’ పేరుతో విద్యా వ్యవస్థను పతనావస్థకు చేర్చారని టీడీపీ సభ్యులు మండిపడ్డారు. విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించిన మంత్రి లోకేష్ అన్నారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 12…
ఆహార పదార్థాల్ని కల్తీ చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాసనసభలో సభ్యులు ఆహార కల్తీపై సంధించిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. మానవ వినియోగానికి సంబంధించిన ఆహార వస్తువుల అమ్మకం, నిల్వ, పంపిణీ దిగుమతుల వంటివాటి నియంత్రణ, పర్యవేక్షణకు సంబంధించి 2006 నాటి ఆహార భద్రత, ప్రమాణాల చట్ట…
నేడు 14వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. క్వశ్చన్ అవర్‌తో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మహిళలకు ఆర్ధిక సాయం, కృష్ణపట్నం ఓడరేవు నుంచి ఎగుమతి అండ్ దిగుమతి, పశు వైద్యశాలలపై సభ్యుల ప్రశ్నలు అడగనున్నారు. విశాఖ రైతులకు భూ కేటాయింపు, దొనకొండలో పారిశ్రామికవాడ, గుంటూరు మిర్చి యార్డులో అక్రమాలపై ప్రశ్నలు సందించనున్నారు. ఇవాళ సభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రెవెన్యు సమస్యలపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనమండలి…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. క్వశ్చన్ అవర్‌తో అసెంబ్లీ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో నీటి సమస్య, పశు వైద్య కళాశాలపై క్వశ్చన్ అవర్‌లో చర్చ జరిగింది. అయితే అసెంబ్లీలో కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడుతుండడంను డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గమించారు. అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలని, ఫోన్‌ను సభ్యులు సైలెంట్‌లో పెట్టుకోవాలని సూచించారు. ఇది విజ్ఞప్తి అని, విజ్ఞప్తులు ఒకటి రెండు సార్లు మాత్రమే ఉంటాయని డిప్యూటీ స్పీకర్ హెచ్చరించారు.…
సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. క్వశ్చన్ అవర్‌తో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవనున్నాయి. నిరుద్యోగ భృతి, పారిశ్రామిక వాడల అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర నిధులకు సంబంధించి సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. నెల్లూరులో పశు వైద్య కళాశాల, ఎన్ఆర్ఈజీఎస్‌లో అవినీతికి సంబంధించి సభ్యుల ప్రశ్నించనున్నారు. క్వశ్చన్ అవర్ తర్వాత మాజీ సభ్యుడు మృతికి సంతాప తీర్మానం చేయనున్నారు. సభలో ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ మెడికల్ ప్రాక్టిషనర్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమంపై…
తెలుగుదేశం పార్టీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా.. మహిళలను దృష్టిలో పెట్టుకునే చేశామన్నారు. ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఇచ్చింది ఎన్టీఆర్ అని తెలిపారు. తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా పనిచేశారని మండిపడ్డారు. రిజర్వేషన్స్ అమలైతే 70-75 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారన్నారు. అమెరికా లాంటి దేశాలలో కూడా మహిళలకు సమానత్వం లేదని, సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతో…