వాయిదా అనంతరం శాసన మండలి తిరిగి ప్రారంభమైంది. ఛైర్మన్ పోడియం చుట్టూ 23 మంది మార్షల్స్‌ను ఏర్పాటు చేశారు. మార్షల్స్ రక్షణలో సభ కాసేపు కొనసాగింది. మార్షల్స్ ఏర్పాటుపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది దుష్ట సంస్కృతి అని బొత్స పేర్కొన్నారు. ఇది పెద్దల సభ అని, ఇలా చేయడం సబబు కాదని ఛైర్మన్ బదులిచ్చారు. మీ సీట్లులో ఉండి నిరసన తెలుపుకోవచ్చని ఛైర్మన్ సూచించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా…
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. మండలి సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. 2023-24 రాష్ట్ర ఆర్థిక సంస్థ లెక్కలపై ఆడిట్ నివేదికను మంత్రి టీజీ భరత్ సభలో ప్రవేశపెట్టనున్నారు. 2015-16, 2016-17, 2017-18, 2018-19 ఏపీ సహకార నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య లిమిటెడ్ వార్షిక ఆడిట్ నివేదికలకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. అలానే సాధారణ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. మండలిలో…
ఇప్పటివరకు ఏపీలో 14 వేల పెన్షన్లు తొలగించాము అని, కానీ లక్షల్లో పెన్షన్లు తొలగిస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పెన్షన్లపై సర్వే పకడ్బందీగా జరుగుతోందని, అనర్హులకు పెన్షన్ తీసేసినా తప్పులేదన్నారు. 2019 జూన్ నాటికి సామాజిక భద్రత పెన్షన్ల కింద 53 లక్షల 85 వేల 796 మంది లబ్ధిదారులు ఉండగా.. ప్రస్తుతం 63 లక్షల 59 వేల 907 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని మంత్రి కొండపల్లి చెప్పారు. ఏపీ అసెంబ్లీలో…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు కొనసాగుతున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై శాసన సభలో సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్‌ను సభ్యులు ప్రశ్నలు అడిగారు. అక్రమార్కులపై ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారని సభ్యులు అడగగా.. మంత్రి నాదెండ్ల సమాధానం చెప్పారు. గత ప్రభుత్వం వ్యవస్థీకృతంగా పీడీఎస్ రైస్ అంటే.. స్మగ్లింగ్ రైస్‌గా మార్చేశారన్నారు. అక్రమ రవాణా అరికట్టడానికి సివిల్ సప్లైస్ చట్టాలు, పీడీ యాక్టులలో సవరణలు తెచ్చి చట్టాలలో మార్పులు తెచ్చామన్నారు. త్వరలో క్యూఆర్…
నేడు 6వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు శాసనసభ.. 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ఆరంభమవుతాయి. ప్రతీరోజూ టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దాంతో శాసనసభ, శాసనమండలి సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఏపీఎస్పీడీసీఎల్ 24వ వార్షిక నివేదిక ప్రతిని, 2013 కంపెనీల చట్టంలోని 395వ సెక్షను…