సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. క్వశ్చన్ అవర్‌తో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవనున్నాయి. నిరుద్యోగ భృతి, పారిశ్రామిక వాడల అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర నిధులకు సంబంధించి సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. నెల్లూరులో పశు వైద్య కళాశాల, ఎన్ఆర్ఈజీఎస్‌లో అవినీతికి సంబంధించి సభ్యుల ప్రశ్నించనున్నారు. క్వశ్చన్ అవర్ తర్వాత మాజీ సభ్యుడు మృతికి సంతాప తీర్మానం చేయనున్నారు. సభలో ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ మెడికల్ ప్రాక్టిషనర్ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.
మరోవైపు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2023-24 ఏపీ మెట్రో రైలు సంస్థ లిమిటెడ్ యొక్క 9వ వార్షిక నివేదికను పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశపెట్టనున్నారు. 2025 ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల, పట్టాదారు పాసు పుస్తకముల సవరణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించవలసినదిగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రతిపాదించనున్నారు. ఉద్యోగుల సమస్యలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
ఇవాళ మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో:
# ఈఏపీ లపై నిధుల దుర్వినియోగం
# పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్
# సౌర విద్యుత్ కొనుగోలు
# ఫీజు రీయింబర్స్‌మెంట్
# రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వ విద్యాలయాలు
# విశాఖపట్నంలో ఐటీ పార్కులు
# విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలు
# వాలంటీర్లకు గౌరవ వేతనం పెంపుదల
# వేకెన్సీ రిజర్వ్ లో పోలీస్ సిబ్బంది
# ప్రపంచ ఆర్థిక సదస్సులో ఎంఓయూలు
# ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల రుణాలు