అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు వినటానికి సిగ్గుపడుతున్నాం అని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. బాలయ్య అసెంబ్లీలో మామూలుగా ఉన్నాడా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన ఒక్క కార్యక్రమంలో భాగమయ్యాడా? అని అడిగారు. ఒక మాజీ సీఎం వైఎస్ జగన్, చిత్ర పరిశ్రమలో ముఖ్య హీరో చిరంజీవిని అవమానించడం సరికాదని మండిపడ్డారు. మండలి చైర్‌లో ఒక దళితుడు కూర్చున్నాడని అవమానించాలని చూస్తున్నారన్నారు. రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికీ ప్రతిపాదించిన హక్కులు కాపాడాలని, కానీ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాజిస్టిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వస్తు రవాణా, ప్రయాణికుల రవాణా లాంటి మాధ్యమాలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారి మార్గాలు, రైల్వే.. ఇలా వేర్వేరు రంగాలను విస్తృతం చేయాలని సూచించారు. భారత్‌లో లాజిస్టిక్స్ వ్యయం రూ.24.01 లక్షల కోట్లు అని, జీడీపీలో లాజిస్టిక్స్ వాటా 7.97 శాతంగా ఉందని వివరించారు. రవాణా రంగంలో రహదారి ద్వారా జరిగే రవాణా 41…
ప్రతి ఎమ్మెల్యే నెలకు ఒక రోజు రైతుల దగ్గరకు వెళ్లి సమస్యలు తెలుసు కోవాలన్నారు సీఎం చంద్రబాబు. వచ్చే నెల నుంచి రైతులకు సంబంధించి తక్షణ కార్యాచరణ ప్రారంభిస్తాం అని ప్రకటించారు. తాను ఐటీపై మాట్లాడితే ఐటీ వ్యక్తి అనుకుంటారని, కానీ రైతుల కోసమే ఎక్కువ ఆలోచిస్తా అన్నారు సీఎం. వరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలన్నారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం అని, రైతుల నికర ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నాం అని…
ఆదాయం వచ్చే పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అరటి, మిరప, మామిడి, పూలు, టమాటో, బత్తాయి, ఆయిల్‌పామ్, మిరియాలు, నిమ్మ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. వచ్చే ఐదేళ్లలో హార్టీకల్చర్‌ను 25 లక్షల హెక్టార్లకు పెంచేలా చర్యలు చేపట్టామని చెప్పారు. మరో పదేళ్లలో మహారాష్ట్ర, యూపీని అధిగమించి.. ఏపీ నెంబర్‌వన్ కావాలని ఆకాక్షించారు. రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారని సీఎం చెప్పుకొచ్చారు.…
రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్‌గా జీఎస్టీ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాల్లో అనేక మార్పులు వస్తాయన్నారు. ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్’ అని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో మేడిన్ ఇండియా మరింత బలోపేతం అవుతోందన్నారు. బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని సీఎం చెప్పారు. దసరా నుంచి దీపావళి వరకు జీఎస్టీ ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం తెలిపారు. జీఎస్టీ సంస్కరణలపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు…
జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి మార్గం వేస్తాయి అని వ్యాఖ్యానించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సంస్కరణలను ముందుండి నడిపిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కృషి అభినందనీయం అంటూ ప్రశంసలు గుప్పించారు.. రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగినా.. సామాజిక ప్రయోజనాల కోసం సమర్థించామని తెలిపారు.
Ambati Rambabu Slams TDP:164 సీట్లు తెచ్చుకుని మంచి పాలన చేయాల్సిన మీరు జగన్ నామ జపం చేస్తున్నారని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.. తాజాగా అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీల ప్రక్రియ సంగతి మర్చిపోయి జగన్ కట్టడి కోసం పనిచేస్తున్నారని.. చిట్టి నాయుడు దెబ్బకు చంద్రబాబు బుర్ర కూడా పోయిందన్నారు.. జగన్ ను ఆపటం మీ తరం కాదు.. జగన్ వస్తే విపరీతంగా జనం వస్తున్నారని మీరే ప్రచారం…
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు, పోలీస్ వెల్ఫేర్‌పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు కొణతాల రామకృష్ణ ప్రశ్నించారు. ఇందుకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 16,862 కానిస్టేబుల్ పోస్టుల్లో 6,100 పోస్టుల నియామకం పూర్తి కానుందని తెలిపారు. మిగిలిన 10,762 ఖాళీల నియామకానికి ప్రభుత్వానికి, డీజీపీ గారికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని చెప్పారు. అనుమతులు రాగానే మిగిలిన పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు చేపడతాం అని హోంమంత్రి చెప్పుకొచ్చారు. ‘రాష్ట్రంలో మొత్తం 16,862…
ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల నిర్వహణలో పలువురు ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. సభ్యులు ప్రశ్నలు అడిగి సభకు డుమ్మా కొట్టడంపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్నలు అడిగిన వారు సభకు రాకపోవడం వలన మరో ఇద్దరు మాట్లాడే అవకాశం కోల్పోతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ రిజిస్టర్లలో సంతకాలు ఉంటునాయి కానీ.. సభలో సదరు సభ్యులు కనిపించడం లేదని స్పీకర్ పేర్కొన్నారు. ప్రజల చేత ఎన్నికై దొంగలా రావడం ఏంటి? అని ఆగ్రహం…