కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40 వేల 336 వ్యవసాయ కనెక్షన్‌లు మంజూరు చేశామన్నారు. ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌కు 2 లక్షల 60 వేలు, ఉచిత విద్యుత్‌కు 12 వేల 400 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గతంలో వేర్వేరు రేట్లకు ట్రాన్సఫార్మర్లు కొనుగోలు చేశారని, ఇక అలా లేకుండా చూస్తామని మంత్రి గొట్టిపాటి చెప్పారు. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.…
ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అనంతరం 2025-26 బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధులు తదితర అంశాలపై సభలో చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల నేపథ్యంలో స్కూళ్లలో ప్రహారీ నిర్మాణం, డీఎస్సీపై అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. మెగా డీఎస్సీల ద్వారా త్వరలో 16,347 పోస్టుల భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ప్రహారీల నిర్మాణానికి రూ.3వేల కోట్లు అవసరం అవుతుందన్నారు. అన్ని కాలేజీలు, స్కూళ్లలో ‘ఈగల్’…