CM Chandrababu: మహారాష్ట్ర, యూపీని అధిగమించి.. ఏపీ నెంబర్‌వన్ కావాలి!
- ఆదాయం వచ్చే పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం
- హార్టీకల్చర్‌ను 25 లక్షల హెక్టార్లకు పెంచేలా చర్యలు
- మహారాష్ట్ర, యూపీని అధిగమించి ఏపీ నెంబర్‌వన్ కావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదాయం వచ్చే పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అరటి, మిరప, మామిడి, పూలు, టమాటో, బత్తాయి, ఆయిల్‌పామ్, మిరియాలు, నిమ్మ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. వచ్చే ఐదేళ్లలో హార్టీకల్చర్‌ను 25 లక్షల హెక్టార్లకు పెంచేలా చర్యలు చేపట్టామని చెప్పారు. మరో పదేళ్లలో మహారాష్ట్ర, యూపీని అధిగమించి.. ఏపీ నెంబర్‌వన్ కావాలని ఆకాక్షించారు. రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారని సీఎం చెప్పుకొచ్చారు. ఏపీ అసెంబ్లీలో జీఎస్టీ సంస్కరణలపై మాట్లాడిన అనంతరం వ్యవసాయంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు.
Also Read: CM Chandrababu: మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయండి!
Also Read
‘రాష్ట్రానికి 41 శాతం ఆదాయం సేవారంగం నుంచి వస్తుంది. ఆదాయం వచ్చే పంటలు వేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. పశుసంపదపై 19 లక్షల కుటుంబాలు ఆధారపడ్డాయి. పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి మరింత పెరగాలి. స్వయం సహాయక సంఘాల మహిళల ఆదాయం పెంచుతున్నాం. 157 గోకులాలు వస్తున్నాయి, పశువులకు హాస్టళ్లు తెస్తున్నాం. గోకులాలకు గడ్డి కూడా సరఫరా చేస్తాం. రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. రాయలసీమలో హార్టీకల్చర్, మైక్రో ఇరిగేషన్ రావాలనేది నా ఆకాంక్ష. హార్టీకల్చర్‌లో 21 శాతం వృద్ధి రేటు సాధించాం. హార్టీకల్చర్ అభివృద్ధిపై మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. అరటి, మిరప, మామిడి, పూలు, టమాటో, బత్తాయి, ఆయిల్‌పామ్, మిరియాలు, నిమ్మ సాగును ప్రోత్సహిస్తున్నాం. వచ్చే ఐదేళ్లలో హార్టీకల్చర్‌ను 25 లక్షల హెక్టార్లకు పెంచేలా చర్యలు తీసుకున్నాం. మరో పదేళ్లలో మహారాష్ట్ర, యూపీని అధిగమించి మనం నెంబర్‌వన్ కావాలి’ అని సీఎం అన్నారు.
తాజావార్తలు
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!