తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ రంగంలోకి దిగింది.. జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరయ్యారు.. గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చ సాగింది.. గంటన్నరపాటు సాగిన ఈ భేటీ ముగిసిన తర్వాత ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో…
నీటి వాటాలపై తేల్చుకునేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తినబాట పడుతున్నారు.. ఎల్లుండి మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంల సమావేశం ఖరారైంది.. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఖరారు చేసింది.. ఢిల్లీ వేదికగా ఎల్లుండి మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు.. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశాన్ని ఫిక్స్ చేసింది జలశక్తి శాఖ.. ఎల్లుండి మధ్యాహ్నం 2.30 గంటలకు జరగనున్న ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, ప్రాజెక్టులపై…
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. రెండు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది కేంద్రం.. అందులో ఆంధ్రప్రదేశ్‌కు 498 కోట్ల రూపాయలు కేటాయించగా.. తెలంగాణకి 516 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది.
వర్షాలు, వరదలతో భారీ నష్టాన్ని చవి చూసిన తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించినట్టు వార్తలు గుప్పుమన్నాయి.. వరద సాయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్ల నిధులు విడుదల చేసినట్టు ప్రచారం జరిగింది.. అయితే, ఈ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. కేంద్రం సాయం చేసింది అనే వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
Many trains canceled in AP and Telangana: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు.
పన్ను మినహాయింపులు కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అత్యధిక రిటర్న్ లు దాఖలయ్యాయని.. అవన్నీ తప్పుల తడకలని ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత తెలిపారు. గడిచిన మూడేళ్లుగా తెలంగాణ, ఏపీలో తప్పుడు క్లెయిమ్‌లతో ఉద్యోగులు అత్యధిక రిటర్న్ లు దాఖలు చేసి.. రిఫండ్ పొందినట్టు తమ విచారణలో తేలిందన్నారు.
AP, Telangana: ఇంటర్నేషనల్ మార్కెట్లలో వైద్య పరికరాల ఎగుమతుల ప్రోత్సాహకానికి ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌ని ఏర్పాటుచేసినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫార్మాస్యుటికల్స్ డిపార్ట్‌మెంట్‌లో భాగంగా పనిచేసే ఈ కౌన్సిల్ హెడ్‌క్వార్టర్స్ నోయిడాలో ఉంటుందని, బ్రాంచ్ ఆఫీసులు ఏపీ, తెలంగాణల్లో ఉంటాయని పేర్కొంది. మన దేశం గత ఆర్థిక సంవత్సరంలో 23 వేల 766 కోట్ల రూపాయల విలువైన మెడికల్ డివైజ్‌లను ఎగుమతి చేసింది.
Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్ ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో రేపు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 8వ తేదీ వరకు (అంటే 12 రోజుల పాటు) జరగనున్నాయి. ఈ పోటీల్లోని 6 ఈవెంట్లలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12 మంది ప్రముఖ క్రీడాకారులు పాల్గొంటున్నారు.
కృష్ణా నది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతోన్న సమయంలో.. కేంద్ర మంద్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశం అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆరు రోజులుగా హస్తినలో మకాం వేసిన ప్రధాని మోడీ, అమిత్‌షా.. మరికొందరు కేంద్ర మంత్రులను కలుస్తున్న యాన.. ఇవాళ జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌తో భేటీ అయ్యారు.. కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని ఈ…