AP, Telangana: ఇంటర్నేషనల్ మార్కెట్లలో వైద్య పరికరాల ఎగుమతుల ప్రోత్సాహకానికి ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌ని ఏర్పాటుచేసినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫార్మాస్యుటికల్స్ డిపార్ట్‌మెంట్‌లో భాగంగా పనిచేసే ఈ కౌన్సిల్ హెడ్‌క్వార్టర్స్ నోయిడాలో ఉంటుందని, బ్రాంచ్ ఆఫీసులు ఏపీ, తెలంగాణల్లో ఉంటాయని పేర్కొంది. మన దేశం గత ఆర్థిక సంవత్సరంలో 23 వేల 766 కోట్ల రూపాయల విలువైన మెడికల్ డివైజ్‌లను ఎగుమతి చేసింది. అంతకుముందు సంవత్సరం ఈ ఎక్స్‌పోర్టుల విలువ 19 వేల 736 కోట్లు మాత్రమే. బ్రాంచ్ ఆఫీసులను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటం పట్ల స్థానిక వాణిజ్య వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
2 తెలుగు రాష్ట్రాల్లో 78 మంది శ్రీమంతులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో 78 మంది సంపన్నులు ఉన్నట్లు IIFL Wealth Hurun India Rich List-2022 తెలిపింది. మినిమం వెయ్యి కోట్లకు పైగా సంపద కలిగినవాళ్లను మాత్రమే లెక్కలోకి తీసుకొని జాబితాను రూపొందించారు. ఈ లిస్టులో ఉన్న రిచెస్ట్ పర్సన్ల మొత్తం ఆస్తి విలువను 3 లక్షల 90 వేల 500 కోట్ల రూపాయలుగా వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం ఏపీ, తెలంగాణల్లో 11 మంది శ్రీమంతులకు కనీసం 8 వేల కోట్ల రూపాయల చొప్పున ఆస్తులు ఉండటం విశేషం.
read also: Adani, Reliance Pact: ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద.. ఈ ఇంటి మీది కాకి ఆ ఇంటి మీద వాలటానికి వీల్లేదు
‘దొడ్ల’లో ‘భారత్’కు షేరు
ఇటీవలి కాలంలో కరోనా వ్యాక్సిన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన హైదరాబాద్ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్.. దొడ్ల డెయిరీ ఈక్విటీలను కొనుగోలు చేసింది. 3 పాయింట్ సున్నా ఏడు శాతం ఈక్విటీలను.. అంటే.. 18 లక్షల 31 వేల 434 షేర్లను సొంతం చేసుకుంది. ఒక్కో స్టాక్‌ను 525 రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన సునిల్‌రెడ్డి నుంచి సున్నా పాయింట్ మూడు 2 శాతం వాటాలను.. అంటే.. ఒకటీ పాయింట్ తొమ్మిది ఐదు లక్షల షేర్లను పొందింది. ఈ మేరకు 106 కోట్ల రూపాయలకు పైగా చెల్లించినట్లు NSE బ్లాక్‌డీల్స్ డేటాను బట్టి తెలుస్తోంది.