Anna University Case: తమిళనాడులో సంచలనం సృష్టించిన 19 ఏళ్ల అన్నా యూనివర్సిటీ విద్యార్థిని అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువడింది. స్థానికంగా బిర్యానీ విక్రేత అయిన నిందితుడు జ్ఞానశేఖరన్‌కు జీవిత ఖైదు విధించబడింది. విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడినందుకు చెన్నైలోని మహిళా కోర్టు నిందితుడికి శిక్షను ఖరారు చేసింది. జీవిత ఖైదుతో పాటు రూ. 90,000 జరిమానా విధించింది.
Anna University Case: చెన్నై అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల ఘటన తమిళనాడులో రాజకీయ దుమారానికి కారణమైంది. 19 ఏళ్ల యువతిపై వర్సిటీ క్యాంపస్‌లోనే లైంగిక దాడి జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తికి అధికార డీఎంకే పార్టీలో సంబంధాలు ఉండటం సంచలనంగా మారింది. అధికార ఎంకే స్టాలిన్ ప్రభుత్వంపై బీజేపీతో పాటు అన్నాడీఎంకే పార్టీలు మండిపడుతున్నాయి.
Anna University Incident: చెన్నైలోని అన్నాయూనివర్సిటీ క్యాంపస్‌లో 19 ఏళ్ల ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ విద్యార్థినిపై లైంగిక దాడి కేసు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అధికార డీఎంకే సర్కార్‌పై, సీఎం ఎంకే స్టాలిన్‌పై విరుచుకుపడుతున్నారు.