ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్ పోర్టల్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్ జ్యాపి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. జ్యాపి యాప్ ని రూపొందించిన ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే, కృష్ణ గొర్రెపాటి ‘జ్యాపి స్టూడియోస్’ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్, సీనియర్ ప్రొడ్యూసర్ కె. ఎల్. దామోదర్ ప్రసాద్, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామక్రిష్ణ, రాజా రవీంద్ర తదితరులు ముఖ్య అతిధులుగా బ్యానర్ లాంచ్…
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సినిమా చేస్తోన్న బాలయ్య.. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ (NBK108) చేయనున్న విషయం తెలిసిందే! ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తవ్వగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సైతం చకచకా జరుగుతున్నాయి. తండ్రి, కూతురు మధ్య బంధం నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూతురి పాత్రకు శ్రీలీలను ఎంపిక చేయడమూ జరిగింది. హీరోయిన్, ఇతర ప్రధాన నటీనటుల్ని ఎంపిక చేసి.. సెట్స్ మీదకి తీసుకెళ్లడమే తరువాయి. ఈ…
రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ది వారియర్’ మూవీ గురువారం జనం ముందుకు రాబోతోంది. దీని తర్వాత ఈ చిత్ర నిర్మాత శ్రీనివాస చిట్టూరి బ్యానర్ లోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు రామ్. దీని గురించి రామ్ మాట్లాడుతూ, ”నా సినిమాలు హిందీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అలానే బోయపాటి గారి సినిమాలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక హీరోను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత…
ప్రముఖ యు ట్యూబర్, బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ ఓటీటీ ఫ్లాట్ ఫై ఎంట్రి ఇస్తున్నాడు. ఆహాలో ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ పేరుతో వెబ్ సీరీస్ చేస్తున్నాడు. ఈ వెబ్ సీరీస్ టీజర్ ను అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సీరీస్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి వారం ఒక్కో కొత్త ఎపిసోడ్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసింది ఆహా. డిటెక్టీవ్ కావాలని ప్రయత్నించే సంతోష్ డిటెక్టీవ్ ఏజెన్సీలో చేరతాడు. అక్క…
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం మే 27 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.100 కోట్ల క్లబ్బులో కూడా జాయిన్ అయ్యింది. దీంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా అదే రేంజ్ లో చేసుకున్నారు. ఇంకా కొన్నిచోట్ల ఎఫ్ 3 రికార్డు మోత మోగిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా ట్రిపుల్ ప్లాటినం…
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 చేస్తోన్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో NBK108 చేయనున్న సంగతి తెలిసిందే! ఆల్రెడీ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరిపాటి నిర్మిస్తున్న ఈ సినిమా గురించి లేటెస్ట్గా ఓ ఆసక్తికరమైన అప్డేట్ తెరమీదకొచ్చింది. ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కూడా భాగం కానున్నాడట!…
రోరింగ్ లయన్ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన సినిమాల నుంచి టీజర్లు, పోస్టర్ విడుదలై నెట్టింట్లో హంగామా చేస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఎఫ్3 డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించబోతున్నారని చిత్రసీమలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే నేడు బాలయ్య బర్త్‌డే సందర్శంగా ఆ వార్తను నిజం చేస్తూ.. బాలకృష్ణ 108వ సినిమా బిగ్ అప్డేట్ను విడుదల చేశారు. ఇటీవల ఎఫ్ 3…
ఒక సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. 24 క్రాప్ట్స్ నుబ్యాలెన్స్ చేస్తేనే మంచి అవుట్ ఫుట్ వస్తుంది. ఆ బాధ్యత అంతా డైరెక్టర్ పైనే ఉంటుంది.. అంతమందిని హ్యాండిల్ చేసేటప్పుడు ఎక్కడో ఒకచోట ఎవరితో ఒకరితో గొడవలు ఉండడం సహజం.. అవి ఎలాంటి విబేధాలు అయినా వాటిని సరిచేసుకోవడం డైరెక్టర్ పైనే ఉంటుంది. ఇక తాజాగా ‘ఎఫ్3’ సినిమాతో హిట్ అందుకున్న అనిల్ రావిపూడి కూడా అదే విషయాన్నీ చెప్పుకొచ్చాడు.. గత కొన్ని రోజులుగా…
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పట్నుంచో పడిగాపులు కాస్తున్నారు. నిజానికి.. అఖిల్ ఎంట్రీ ఇచ్చినప్పుడే మోక్షజ్ఞ తెరంగేట్రం కూడా ఉంటుందని అంతా ఆశించారు. కానీ, అది జరగలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని బాలయ్య చెప్తూ వస్తున్నారే తప్ప, ఆ ముహూర్తం మాత్రం ఖరారు కావడం లేదు. అప్పట్లో ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో మోక్షజ్ఞ కనిపించొచ్చని టాక్ వినిపించింది కానీ, తీరా సినిమా విడుదలయ్యాక ఫ్యాన్స్ నిరాశచెందారు. కొంతకాలం తర్వాత దన దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని…
అనిల్ రావిపూడి, బాలయ్య కలయికలో NBK108 రూపొందనున్న విషయం తెలిసిందే! ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, అప్పుడే పలు ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకు వచ్చేశాయి. ఓ తండ్రి, కూతురు చుట్టూ ఈ సినిమా కథ అల్లుకుని ఉంటుందని.. బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనుండగా, పెళ్లిసందD ఫేమ్ శ్రీలీలా కూతురిగా నటించనుందని స్వయంగా అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ ప్రమోషన్స్‌లో రివీల్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఇందులో బాలయ్య సరసన ప్రియమణిని…