నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా లో బాలయ్య తన నటనతో విశ్వరూపం చూపించారు.. భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.ఈ సినిమా లో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర లో నటించి మెప్పించాడు.ఇక ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. భగవంత్ కేసరి సినిమా లో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే యంగ్ సెన్సేషన్ శ్రీలీల బాలయ్య కూతురి పాత్ర లో నటించింది. అదిరిపోయే టాక్ తో దూసుకుపోతున్న భగవంత్ కేసరి సినిమా కు సీక్వెల్ ఉంటుందా అని బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఇదే ప్రశ్నకు దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న దగ్గర నుంచి భగవంత్ కేసరి కు సీక్వెల్ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ..భగవంత్ కేసరి కోసం తనతో కలిసి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు అనిల్. అలాగే ఈ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సినిమా కి సీక్వెల్ తీసే ధైర్యం తనకు లేదని ఆయన అన్నారు. భగవంత్ కేసరి మూవీ బరువు మోసినందుకే ఎంతో నలిగిపోయానని, ఇక ఇప్పుడు సీక్వెల్ తీయగలిగే శక్తిని బాలకృష్ణ గారు నాకిస్తే వెంటనే తీస్తానని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి. దాంతో త్వరలోనే భగవంత్ కేసరి కు సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు..