జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్… రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి దిగజారుడు మాటలు తగవు అంటూ పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు.. ఇక, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని చూసి నేర్చుకోవాలని సూచించిన ఆయన… అలాగే ఓ రాజకీయ నేత ఎలా ఉండకూడదో పవన్ కల్యాణ్‌ని చూసి నేర్చుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఆరు…
Anil Kumar Yadav: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై నందమూరి హీరోలు చేసిన ట్వీట్లపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఇప్పుడున్న టీడీపీ నారా వారి పార్టీగా మారిందని.. ఎన్టీఆర్ పేరు ఎత్తే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టుకోలేదని చంద్రబాబును ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాన్ని వైఎస్ఆర్ తెచ్చారని.. ఆ…
అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే. 2019 నుంచి మొన్నటి క్యేబినెట్ పునర్ వ్యవస్థీకరణ వరకు రాష్ట్ర మంత్రి. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా అదే సెగ్మెంట్ నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టినా.. ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది. 2019లో రెండోసారి గెలిచాక కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి అనిల్‌కు.. మంత్రి అయ్యాక కనిపించిన అనిల్‌కు చాలా తేడా ఉందనేది…
టీడీపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు వైసీపీ ఎమ్మెల్యేలతో లోపాయికారి ఒప్పందంలో ఉన్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ట్విటర్ మాధ్యమంగా కౌంటర్ ఇచ్చారు. కేవలం నెల్లూరులోనే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తమతో టచ్‌లో ఉన్నారని.. అందులో రోజూ నీతో మాట్లాడే ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారని అన్నారు. ప్రతిరోజూ నిన్ను, నీ పార్టీని బహిరంగంగా బూతులు తిట్టే ఇంకో ఎమ్మెల్యే కూడా ఉన్నారని.. దమ్ముంటే…
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ మరోసారి పప్పు అని నిరూపించుకున్నారని విమర్శించారు. కిన్నెర ప్రసాద్‌కు తాను బినామీనని లోకేష్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అసలు బినామీ నువ్వేనంటూ ధ్వజమెత్తారు. అక్రమ లే-ఔట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలియదా? అంటూ నిలదీశారు. టీడీపీలో ఉన్నప్పుడు కిన్నెర ప్రసాద్ నాలుగు లే-ఔట్లు వేశారని గుర్తు చేసిన…