నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ అనూహ్యంగా జగన్ మొదటి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. సీనియర్ నేతలు ఎందరో ఉన్నా అనిల్ కుమార్‌కు జగన్ అవకాశం ఇచ్చారు. కీలకమైన భారీ నీటిపారుదల శాఖకు మంత్రి అయ్యారు. మూడేళ్ల సమయంలో అనిల్ తనదైన శైలిలో కొనసాగారు. గత నెలలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సర్వేపల్లి ఎంఎల్‌ఏగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి స్థానం దక్కింది. అనిల్ కుమార్ మాజీ అయ్యారు. మరుసటి రోజే…
నెల్లూరు కోర్టులో జరిగిన అంశంపై తీవ్రంగా స్పందించారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. నా మీద 2017లో సోమిరెడ్డి కేసు పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు చార్జిషీట్ చేస్తే కోర్టు ఇది సరైన కేసు కాదని చెప్పింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక చార్జిషీట్ ఫైల్ అయ్యింది. దొంగతనాలు చేయాల్సిన అవసరం మాకేమన్నా ఉందా, దొంగతనం చేసి కాగితాలు బయటపడేస్తారా? ఒక పథకం ప్రకారంగా కావాలని చేసి కక్షదారులు చేసి ఉండొచ్చు అనే అనుమానం ఉందన్నారు…
ఏపీలో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ సందర్భంగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో విభేదాలు బయటపడుతున్నాయి. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అభినందన సభలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఆరోపణలు చేశారు. మూడేళ్లుగా జిల్లాలో ఇరిగేషన్‌కు సంబంధించి ఆశించిన మేర అభివృద్ధి జరగలేదంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆనం వ్యాఖ్యలకు తాజాగా అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో రూ.3 వేల కోట్లతో నీటిపారుదల పనులు జరుగుతున్నాయని…
సింహపురి రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగా వుంటాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (AnilKumar Yadav) ఆదివారం భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి తన బలం, బలగం ఏంటో చూపించారు. అదే టైంలో తాజా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కూడా తానేంటో నిరూపించుకున్నారు. ఇదిలా వుంటే నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి నియోజకవర్గమైన సర్వేపల్లిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు బహిరంగసభలో అనిల్ కుమార్ యాదవ్…
మంత్రివర్గంలో బెర్త్ మొదటిసారి తృటిలో తప్పినా.. రెండోసారి మాత్రం ఛాన్స్ దక్కించుకున్నారు. కానీ.. ఆ ఆనందం మాత్రం మిగలడం లేదు. మంత్రిగా జిల్లాలో అడుగు పెట్టకముందే.. ఒకవైపు సొంత పార్టీ నాయకుల నుంచి.. మరోవైపు పాత కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయట. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఆయన వచ్చిన కష్టాలేంటి? ఆదిలోనే హంసపాదుగా మారిన విషయాలేంటి? కాకాణి గోవర్దన్‌రెడ్డి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు…
ఏపీలో ప్రస్తుతం నెల్లూరు రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితులు నెల్లూరులో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి పర్యటన సందర్భంగా నెల్లూరు నగరంలో ఆయన అనుచరులు భారీ ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు. అంతేకాకుండా భారీగా స్వాగత ఏర్పాట్లు కూడా చేశారు.…
నెల్లూరులో వైసీపీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. రేవు జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనుచరులను ఆదేశించారు. రాత్రి భోజనంతో పాటు ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్‌కు మాజీ మంత్రి అనిల్ కుమార్‌తో పాటు పలువురు నేతలు చేరుకున్నారు. దీంతో.. నెల్లూరు వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నట్టు అయ్యింది.. కాకాణి, మాజీ మంత్రి అనిల్ మధ్య వివాదం…
ఏపీలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఎక్కడైనా అధికార, విపక్షాల మధ్య వార్ ఉంటుంది. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం స్వపక్షంలో విపక్షం అన్న పరిస్థితి నెలకొంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ కొందరు నేతల మధ్య వార్‌కు కారణంగా మారింది. నెల్లూరు జిల్లాలో తనకు మరోసారి మంత్రి పదవి రాకపోవడంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కినుక వహించినట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి జిల్లాకు వస్తున్న…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పలు సందర్భాల్లో తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్.. మరోసారి జనసేనానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయలేని పవన్ కల్యాణ్… భీమ్లా నాయక్ కాదని తెలుగుదేశం పార్టీ వద్ద బిచ్చం అడుక్కునే బిచ్చ నాయక్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. Read Also: VH: మళ్లీ సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసిన వీహెచ్.. చెప్పినా పట్టించుకోరా..? పవన్…