Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record What Is The Problem To Change The Place

YCP : రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. చోటును మార్చడానికి ఇబ్బందేంటి..?

NTV Telugu Twitter
Published Date :July 11, 2022 , 12:05 pm
By Premchand Chowdary
YCP : రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. చోటును మార్చడానికి ఇబ్బందేంటి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

అనిల్‌ కుమార్‌ యాదవ్‌. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే. 2019 నుంచి మొన్నటి క్యేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ వరకు రాష్ట్ర మంత్రి. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా అదే సెగ్మెంట్ నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టినా.. ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది. 2019లో రెండోసారి గెలిచాక కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి అనిల్‌కు.. మంత్రి అయ్యాక కనిపించిన అనిల్‌కు చాలా తేడా ఉందనేది నియోజకవర్గంలోని వైసీపీ నేతలు చెప్పేమాట. మంత్రిగా ఆయన తీరులో చాలా మార్పు వచ్చిందని చెబుతారు.

మంత్రిగా ఉన్న మూడేళ్లూ నియోజకవర్గంలోని వైసీపీ సీనియర్లను విస్మరించారనే ఆరోపణలు అనిల్‌పై ఉన్నాయి. సీఎం జగన్‌ మీద అభిమానంతో ఎన్నికల్లో అనిల్‌కు మద్దతిచ్చిన బలమైన సామాజికవర్గానికి చెందిన కొందరు ఆయనతో అంటీముట్టనట్టు ఉంటున్నారట. మినిస్టర్‌గా తన వర్గానికే అనిల్‌ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపిస్తుంటారు. అనిల్‌ సమీప బంధువొకరు అన్ని వ్యవహారాల్లో తలదూర్చి భారీగా వెనకేసుకున్నట్టు వైసీపీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. దాదాపు 13 కోట్లతో నిర్మించిన విలాసవంతమైన భవనాన్ని వాళ్లు ఉదాహరణగా చూపిస్తున్నారట. చెన్నై, బెంగళూరుల్లో ఖరీదైన ఆస్తులు పోగేసినట్టు చెవులు కొరుక్కుంటున్నారట. ఈ కారణంగానే మొదటి నుంచి అనిల్‌ కోసం పనిచేసిన పలువురు క్రమంగా దూరం జరుగుతున్నారట.

అనిల్‌కు మొదటి నుంచి అనుచరుడిగా ఉన్న నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్‌.. ప్రస్తుతం మాజీ మంత్రి కార్యక్రమాల్లో కనిపించడం లేదు. కాకాణి గోవర్దన్‌రెడ్డి మంత్రి అయ్యాక అనిల్ అనుచరుల్లో చాలా మంది ప్లేట్ ఫిరాయించేశారు. పైగా నెల్లూరు సిటీలోని ప్రజల్లో అనిల్‌కు బలం తగ్గిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట. ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో ఆయన్ని వెంకటగిరి నుంచి బరిలో దింపాలని అనుకుంటున్నారట. ఆ విషయాన్ని అనిల్ చెవిలో కూడా వేశారట.

వెంకటగిరిలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఏం చేస్తారనేదానిపై సందిగ్ధత ఉంది. ఆయన కుమార్తె కైవల్య ఇటీవల టీడీపీ నేత లోకేష్‌తో సమావేశమై.. ఆత్మకూరు టికెట్ అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో ఆనం టీడీపీలోకి వెళ్తారని భావిస్తున్నారు. అందుకే వెంకటగిరిలో అనిల్‌ను బరిలో దింపే యోచన చేస్తున్నారట. అనిల్ బీసీ సామాజివర్గం కావడం.. వెంకటగిరిలో ఆ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటం రాజకీయంగా కలిసి వస్తుందని లెక్క లేస్తున్నారట. పార్టీ సమావేశాల్లో తాను నెల్లూరు నుంచే పోటీ చేస్తానని అనిల్‌ చెబుతున్నా.. అనుచరులకు మాత్రం వెంకటగిరిలో పోటీపై సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. నియోజకవర్గం మార్పు వల్లే నెల్లూరు సిటీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అనిల్‌ పట్టించుకోలేదనే ప్రచారం జరుగుతోంది. వెంకటగిరిపై వైసీపీ నుంచి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చాక అక్కడ ఎక్కువగా ఫోకస్‌ పెడతారని భావిస్తున్నారు. మరి.. మాజీ మంత్రి అనిల్ మనసులో ఏముందో.. పార్టీ ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో కాలమే చెప్పాలి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anam ramanarayan reddy
  • Anil Kumar Yadav
  • cm jagan
  • Mukkala Dwarakanath
  • Nellore YCP

తాజావార్తలు

  • Off The Record: వైఎస్ జగన్ పర్యటనలపై వైసీపీ నేతలు కంగారు పడుతున్నారా? ఎందుకా కంగారు..?

  • Pragya Jaiswal : బికినీలో అందాల ట్రీట్ ఇచ్చిన ప్రగ్యాజైస్వాల్

  • Off The Record: ఏపీ బీజేపీ నేతలు మేధావులమంటూ ఢిల్లీ నేతల కళ్ళకు గంతలు కడుతున్నారా?

  • Karishma Kapoor : సంజయ్ కపూర్ అంత్యక్రియల్లో ఏడ్చేసిన కరిష్మాకపూర్..

  • Off The Record: వైసీపీ నేత గోరంట్ల మాధవ్ సైలెంట్ అయ్యారా? చేసారా? మొత్తం ఆ వీడియోనే చేసిందా?

ట్రెండింగ్‌

  • OnePlus Bullets Wireless Z3: 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యంతో రూ.1,699 లకే వన్‌ప్లస్ నెక్‌బ్యాండ్..!

  • Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!

  • BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!

  • Wicket Keeper Catch: నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అనేలా క్యాచ్ ను పట్టుకున్న కీపర్.. వీడియో వైరల్..

  • iQOO Z10 Lite: ఇదెక్కడి మాస్ రా బాబు.. కేవలం రూ. 9999కే అన్ని ప్రత్యేకతలున్న ఫోన్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions