Anil Kumar Yadav: ఏపీలోని బీజేపీ నేతలపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప మాలలో ఉండి తానేదో నేరం, పాపం చేసినట్లు బీజేవైఎం నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. తాను ముస్లిం కండువా కప్పుకోవడాన్ని తప్పుబడుతున్న బీజేపీ నేతలకు.. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులందరూ ఎరుమేలిలో వావర్ స్వామిని దర్శించుకునే విషయం తెలియదా అని ప్రశ్నించారు. వావర్ స్వామి ముస్లిం కాదా అని నిలదీశారు. కన్నెస్వాములందరూ వావర్ స్వామి ఉండే మసీదును దర్శించుకుంటారని.. ముస్లిం దేవతలను ప్రార్థించేవారిలో సగానికి సగం మంది హిందువులే ఉంటారని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
Read Also: Tim Southee: క్రికెట్‌లోనే అదిరిపోయే రికార్డు.. టెస్టుల్లో 300, వన్డేల్లో 200, టీ20ల్లో 100
సోము వీర్రాజు లాంటి బీజేపీ నేతలు కనీసం అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. తాను హిందువులను అవమానించినట్లు మాట్లాడటం సరికాదన్నారు. తాను చేసింది తప్పుకాదని ప్రజలకు తెలుసు అన్నారు. ఇప్పటికైనా విజ్ఞతతో ఆరోపణలు చేస్తే మంచిది అని హితవు పలికారు. అయ్యప్పమాలలో ఉన్నప్పుడు పరమతాన్ని గౌరవిస్తే తప్పేంటని అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. కొన్ని కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వారు తన ఇంటి ముందు ఆందోళనలు చేయడం సిగ్గుచేటు అని చురకలు అంటించారు. కాగా నెల్లూరులోని ఖుద్దూస్ నగర్‌లో శుక్రవారం నాడు ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా అనిల్ కుమార్ యాదవ్ ఇంటింటికీ తిరిగారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజల మతాచారాలకు అనుగుణంగా ముస్లిం టోపీ, కండువా ధరించారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శబరిమలకు వెళ్లకుండా అనిల్‌కుమార్ యాదవ్‌ను హిందువులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
Read Also: Pavitra Lokesh: బ్రేకింగ్.. పోలీస్ స్టేషన్ లో పవిత్ర.. వారిపై ఫిర్యాదు